MEGA 158: ఫ్యాన్స్ కి నిరాశే.. 'మెగా158' ప్రాజెక్ట్  పై మాళవిక అప్డేట్!

యంగ్ బ్యూటీ మాళవిక మోహన్ తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా  రజినీకాంత్  'పేట' ,  విజయ్  'మాస్టర్' సినిమాలతో ఈ  బ్యూటీ బాగా పాపులర్ అయ్యింది.  

New Update
Malavika Mohanan

Malavika Mohanan

MEGA 158: యంగ్ బ్యూటీ మాళవిక మోహన్ తమిళ్, హిందీ, మలయాళం భాషల్లో నటిస్తూ మంచి గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా  రజినీకాంత్  'పేట' ,  విజయ్  'మాస్టర్' సినిమాలతో ఈ  బ్యూటీ బాగా పాపులర్ అయ్యింది.  ప్రస్తుతం రెబల్ స్టార్ ప్రభాస్ జోడీగా  'ది రాజా సాబ్' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాతో మాళవిక తెలుగు తెరకు పరిచయం కాబోతుంది. 

ఇదిలా ఉంటే.. మాళవిక తెలుగులో తన తదుపరి ప్రాజెక్ట్ ను మెగాస్టార్ చిరంజీవితో చేస్తున్నారని కొద్దిరోజులుగా నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతోంది. మెగాస్టార్- బాబీ కాంబోలో తెరకెక్కనున్న 'మెగా 158' లో కథానాయికగా ఎంపికైనట్లు పుకార్లు వినిపిస్తున్నాయి. అయితే తాజాగా మాళవిక ఈ వార్తలపై స్పందించారు. 'మెగా 158'  లో తన రోల్ పై క్లారిటీ ఇచ్చారు.  

Also Read:  Deepika Padukone: “కల్కి 2898 AD”OTTలో దీపికా పదుకొనే పేరు మళ్లీ చేరింది! వివాదానికి తెరపడిందా?

మాళవిక క్లారిటీ.. 

తాను 'మెగా 158' నటిస్తున్నానని వస్తున్న వార్తల్లో ఎలాంటి వాస్తవం లేదని తెలిపారు.  ఎప్పటికైనా తన కెరీర్ లో  ఒకసారి ఐకానిక్ మెగాస్టార్  చిరంజీవితో కలిసి నటించాలనే కోరిక బలంగా ఉంది. కానీ, ప్రస్తుతానికి మాత్రం తాను ఆ ప్రాజెక్టులో భాగం కాదని స్పష్టం చేసింది మాళవిక. ఈ విషయాన్ని తన సోషల్ మీడియా ద్వారా తెలియజేసింది. 

Also Read: Bigg Boss 9: షాకింగ్ న్యూస్.. ఆటలో భరణికి సీరియస్ .. మళ్ళీ హౌజ్ నుంచి అవుట్!

Advertisment
తాజా కథనాలు