/rtv/media/media_files/2025/10/14/bigg-boss-9-2025-10-14-17-45-41.jpg)
bigg boss 9
బిగ్ బాస్ ఇంట్లోకి వైల్డ్ కార్డ్ గా ఎంట్రీ ఇచ్చిన దివ్వెల మాధురి(divvela madhuri) వచ్చిన మొదటి నుంచి హౌజ్ ను అల్లాడిస్తోంది. మొదటి రోజే కిచెన్ డ్యూటీస్ విషయంలో కెప్టెన్ కళ్యాణ్, దివ్య గొడవేసుకుంది. ఫుడ్ మానిటర్ పర్మిషన్ లేకుండా రేషన్ యూజ్ చేసుకోవడంతో ఫుడ్ మానిటర్ దివ్య మాధురిని ప్రశ్నించింది. పర్మిషన్ లేకుండా అలా ఇష్టం వచ్చినట్లుగా వాడుకోవడం తప్పు అని చెబుతుంది. దీంతో దివ్వెల మాధురి కూడా రెచ్చిపోయారు. నిన్న మీరు నాతో మాట్లాడడం ఇష్టం లేదన్నారు కదా.. అందుకే అడగలేదు అంటూ దివ్యకు కౌంటర్ ఇచ్చింది. దానికి దివ్య నాతో మాట్లాడకండి.. కానీ ఇది హౌజ్ మొత్తానికి సంబంధించిన రేషన్ కాబ్బట్టి పర్మిషన్ తీసుకోవాలి అంటూ ఫైర్ అయ్యింది.
ఇదెక్కడి షో ??
Posted by Vasu Prime Gulf Journalist on Tuesday, October 14, 2025
Also Read : ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలై బ్లాక్ బస్టర్ టాక్!
తిండి కోసం లొల్లి
ఇక మాధురి కూడా ఏ మాత్రం తగ్గలేదు.. నిన్ను ఎందుకు అడగాలి.. నేను అడగను అని వాదించింది. నేను తీసుకున్నది చాలా కొంచెం ఫుడే దానికి ఇంత రచ్చ చేస్తున్నావేంటి అన్నట్లుగా దివ్య పై ఫైర్ అయ్యింది. ఒక తల్లిగా ఫుడ్ ను అందరికీ ఎలా సరిపెట్టాలో నాకు తెలుసులే.. నువ్వేం చెప్పాల్సిన అవసరం లేదు అని అంటుంది. ఇందుకు సంబంధించిన ప్రస్తుతం సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అవుతోంది. ఇది చూసిన నెటిజన్లు.. ఇదెక్కడి షో రా బాబు.. తిండి కోసం ఈ లొల్లేంటి అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read: Bigg Boss 9 Telugu: అయ్యా.. తనూజను అంత మాట అనేసిందేంటి.. భరణి షాక్ అంతే! అయేషా ఫుల్ ఫైర్