Bigg Boss 9 Telugu: అయ్యా.. తనూజను అంత మాట అనేసిందేంటి.. భరణి షాక్ అంతే! అయేషా ఫుల్ ఫైర్

బిగ్ బాస్ ఇంట్లో నిన్న మొదలైన నామినేషన్ రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా విడుదలైన ప్రోమోలో అయేషా- తనూజ మధ్య పెద్ద గొడవ జరిగినట్లు ప్రోమోలో కనిపించింది.

New Update

Bigg Boss 9 Telugu: బిగ్ బాస్ ఇంట్లో నిన్న మొదలైన నామినేషన్ రచ్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా విడుదలైన ప్రోమోలో అయేషా- తనూజ మధ్య పెద్ద గొడవ జరిగినట్లు ప్రోమోలో కనిపించింది. సుమన్ శెట్టి నామినేషన్ లో భాగంగా అయేషా తనూజ పై విరుచుకుపడింది. ముందుగా సుమన్ శెట్టి తనూజను నామినేట్ చేస్తూ.. నువ్వు ప్రతి విషయానికి ఎమోషనల్ అవుతున్నావు.. నీ సెంటిమెంట్ డ్రామాలా అనిపిస్తుంది అని చెప్పాడు. దీనికి తనూజ.. నా కంటే మీరెక్కువ ఎమోషనల్ అవుతారా.. ఇంటి నుంచి బట్టలు రాగానే ఊర్చొని ఏడ్చేదెవరో అంటూ వెటకారంగా బదులిచ్చింది. అయినా సరే సుమన్ శెట్టి ఏ మాత్రం తగ్గలేదు.. నా కంటే నువ్వు ఎక్కువగా ఏడుస్తున్నావ్ అంటూ ఫుల్ ఫైర్ మీద కనిపించాడు. 

ఒక బాయ్ ఫ్రెండ్ ఉంటే చాలు.. 

ఇక సుమన్ శెట్టి పాయింట్స్ కి సపోర్ట్ గా వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్ అయేషా రంగంలోకి దిగింది. ''నీ ఎమోషన్స్ వల్ల భరణి ఆట కూడా పాడవుతుంది, స్టార్ మాలో ఆల్రెడీ మంచి సీరియల్స్ వస్తున్నాయి.. నువ్వు మళ్ళీ ఇక్కడ ఒక సెంటిమెంట్ సీరియల్ చూపించాల్సిన అవసరం లేదు అంటూ తనూజ పై రెచ్చిపోయింది. ఇక దీనికి తనూజ కూడా గట్టిగానే కౌంటర్ ఇచ్చింది. ఇక్కడ నేను అన్ని టాస్కులు నాన్నా సపోర్ట్ తోనే ఆడుతున్నానా? లాస్ట్ వీక్ కళ్యాణ్ తో కలిసి ఆడలేదా? అని అయేషాను ప్రశ్నించింది. దీంతో అయేషా.. ఇక్కడ ఒక బాయ్ ఫ్రెండ్, ఒక  నాన్న ఉంటే చాలు ఫైనల్ వరకు వెళ్లొచ్చు అన్నట్లుగా ఉంది అంటూ తనూజ పై షాకింగ్ కామెంట్స్ చేసింది.  

Also Read: Baahubali The Epic: ఎవరి వల్ల కానిది 'బాహుబలి: ది ఎపిక్' రీరిలీజ్ తో జరుగుతోంది.. ఏంటో తెలిస్తే..!

Advertisment
తాజా కథనాలు