/rtv/media/media_files/2025/10/14/ari-movie-2025-10-14-17-00-44.jpg)
ari movie
Ari Movie: పేపర్ బాయ్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన డైరెక్టర్ జయశంకర్.. ఆ తర్వాత 'అరి'(ari-movie) సినిమాను తెరకెక్కించారు. ఎలాంటి అంచనాలు లేకుండా గత వారం థియేటర్స్ లో విడుదలైన ఈ చిత్రం సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంటోంది. ఇప్పటివరకూ ఎవరూ టచ్ చేయని 'అరిషడ్వర్గాలు' అనే కాన్సెప్ట్ తో ఈ సినిమాను రూపొందించారు. ఈ సినిమా కోసం డైరెక్టర్ జయశంకర్ దాదాపు ఏడేళ్ల పాటు కృషి చేశారు. సినిమాలో కృష్ణ తత్వం గురించి ఆయన చూపించిన విధానం ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. కామం, క్రోధం, లాభం, మొహం, మదం, మాత్సర్యం మనిషి జీవితాన్ని ఎలా నాశనం చేస్తాయి, అలాంటి అరిషడ్వర్గాలను జయించడం ఎలా? అనే సందేశాత్మక చిత్రంగా 'అరి' ని మలిచినందుకు ప్రశంసలు కురిపిస్తున్నారు.
#ARI movie devotional touch plus climax twists tho ultimate 🤯. Director Jayashankar ki hatsoff. Story line and cast performance, especially Hero performance matram peaks🔥👌🏻 pic.twitter.com/pIeeNQrTxe
— Mega_Prince 🔥❤ (@M_RJ_D) October 10, 2025
Also Read : శ్రీలీల షాకింగ్ సర్ప్రైజ్! ఎవరీ 'ఏజెంట్ మిర్చి'..?
బ్లాక్ బస్టర్ టాక్
మూవీ క్లైమాక్స్ లో కృష్ణుడి ఆగమనం, అరిషడ్వర్గాల గురించి ఆయన చెప్పే సందేశం ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. రాజకీయ ప్రముఖులు సైతం ఈ సినిమాపై ప్రశంసలు కురిపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి చిత్రబృందాన్ని స్వయంగా పిలిచి అభిమానందించారు. సోషల్ మీడియా, క్రిటిక్స్, రివ్యూస్ అన్ని చోట్ల ఈ సినిమాకు పాజిటివ్ రెస్పాన్స్ వినిపిస్తోంది. సినిమాలోని చివరి 20 నిమిషాల క్లైమాక్స్ గురించి ప్రత్యేకంగా కొనియాడుతున్నారు నెటిజన్లు. మొత్తానికి దర్శకుడు జయశంకర్ మంచి సందేశాత్మక చిత్రంతో మారోసారి విజయం సాధించారు. పేపర్ బాయ్, అరి రెండు బ్యాక్ తో బ్యాక్ హిట్స్ అందుకున్నారు.
ఈ చిత్రంలో సీనియర్ యాక్టర్ సాయి కుమార్, యాంకర్ అనసూయ, వైవా హర్ష, వినోద్ వర్మ ప్రధాన పాత్రలో నటించారు. సినిమాలోని నటీనటుల తమ పాత్రలకు పూర్తి న్యాయం చేశారు. ముఖ్యంగా అనసూయ, సాయి కుమార్, వినోద్ వర్మ పాత్రలు పర్ఫార్మెన్స్ హైలైట్ గా నిలిచాయి. అనూప్ రూబెన్స్ సంగీతం, నేపథ్య సంగీతం, శ్రీకృష్ణుడి పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.
Also Read: This Week Ott Movies: ఈవారం ఓటీటీ, థియేటర్స్ లో ఫుల్ ఎంటర్ టైన్మెంట్.. సినిమాల లిస్ట్ ఇదే?