/rtv/media/media_files/2025/10/23/ayesha-2025-10-23-15-46-13.jpg)
Ayesha
Bigg Boss 9: బిగ్ బాస్ సీజన్ 9 గత సీజన్లతో పోలిస్తే కాస్త ఇంట్రెస్టింగ్ గా, ఎంగేజింగ్ గా ముందుకెళ్తోంది. మొదటి రెండు వారాలు కాస్త చప్పగా ఉన్నప్పటికీ.. వైల్డ్ కార్డ్ ఎంట్రీలతో ఆట కొత్త మలుపు తీసుకుంది. ఏకంగా ఆరుగురు కంటెస్టెంట్లు వైల్డ్ కార్డు ఎంట్రీలుగా హౌజ్ లోకి అడుగుపెట్టారు. గౌరవ్ గుప్తా, మాధురి దివ్వాల, ఆయేషా జీనాథ్, శ్రీనివాస సాయీ, నిఖిల్ నాయర్, రమ్య వైల్డ్ కార్డు కంటెస్టెంట్లుగా వచ్చారు. వీరిలో దివ్వెల మాధురి, అయేషా, రమ్య మోక్ష వచ్చిన మొదటి రోజే హీటెడ్ ఆర్గుమెంట్స్ తో షోను హీటెక్కించారు. ముఖ్యంగా తనూజ వర్సెస్ అయేషా రైవల్రీ(aysha bigg boss 9 telugu) ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.
''షోలో ఒక నాన్న, ఒక బాయ్ ఫ్రెండ్ ను పెట్టుకుంటే చివరి వరకు ఉండొచ్చు అన్నట్లుగా బిగ్ బాస్ నడుస్తుంది అంటూ తనూజాపై ఘాటైన వ్యాఖ్యలు చేసింది అయేషా. ఇటీవలే జరిగిన నామినేషన్ కూడా రీతూ పై రెచ్చిపోయింది. ''నువ్వు లవ్ చేసుకొని తిరగడానికే హౌజ్ కి వచ్చినట్లుగా అనిపిస్తుంది'' అంటూ సంచలన కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ సీజన్ 9 మోస్ట్ కాంట్రవర్షియల్ కంటెస్టెంట్ గా ఈ అమ్మడు పేరు మారుమోగుతోంది.
Also Read : డార్లింగ్ కొత్త పోస్టర్ కెవ్వు కేక.. రాజాసాబ్ బర్త్ డే స్పెషల్!
అయేషా మిడ్ వీక్ ఎలిమినేషన్
అయితే తాజా అప్డేట్ ప్రకారం.. ఎవరూ ఊహించని విధంగా అయేషా ఎలిమినేట్ కాబోతున్నట్లు తెలుస్తోంది. ఈ వారం ఆమె నామినేషన్స్ లో లేకపోయినప్పటికీ.. ఆరోగ్య సమస్యల కారణంగా బిగ్ బాస్ ఇంటిని వదిలి వెళ్లేందుకు నిర్ణయించుకున్నారట. మిడ్ లేదా వీకెండ్ ఎపిసోడ్ ఆమె బయటకు వెళ్లనున్నట్లు టాక్.
Also Read: Pournami Re Release: 'పౌర్ణమి' సీన్ రీ క్రియేట్.. తలపై దీపం పెట్టుకుని థియేటర్లో రచ్చ రచ్చ..!