Bigg Boss 8: 'బిగ్ బాస్ 8' ఫినాలే.. ఫ్యాన్స్ కు షాకిచ్చిన పోలీసులు

నేడు సాయంత్రం బిగ్ బాస్ సీజన్ 8 ఫినాలే జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ వెస్ట్ పోలీసులు బిగ్ బాస్ ఫ్యాన్స్ కు పలు సూచనలు, వార్నింగ్స్ ఇచ్చారు. కార్యక్రమం పూర్తయిన అనంతరం ఊరేగింపులు, ర్యాలీలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు.

New Update
biggboss8

బుల్లితెర రియాలిటీ షో 'బిగ్ బాస్' కు అన్ని భాషల్లో కంటే మన తెలుగులోనే క్రేజ్ ఎక్కువ. ప్రతి సీజన్ ఫినాలే రోజు ఫ్యాన్స్ అన్నపూర్ణ స్టూడియోస్ దగ్గరకి భారీ సంఖ్యలో చేరుకొని విన్నర్ కోసం ఎదురుచూస్తూ ఉంటారు. ఇక విన్నర్ బయటికొచ్చాక ఊరేగింపులు, ర్యాలీలు చేస్తూ ఓ రేంజ్ లో హంగామా చేస్తుంటారు. ఇక గత సీజన్ అయితే ఈ హంగామా గొడవలు, దాడుల వరకు వెళ్ళింది. 

Also Read: ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీకి తప్పిన ప్రమాదం

అందుకే ఈసారి అలా జరగకుండా పోలీసులు ప్రత్యేక బందోబస్తు నిర్వహిస్తున్నారు. నేడు సాయంత్రం బిగ్ బాస్ సీజన్ 8 ఫినాలే జరగనున్న నేపథ్యంలో హైదరాబాద్ వెస్ట్ పోలీసులు బిగ్ బాస్ ఫ్యాన్స్ కు పలు సూచనలు, వార్నింగ్స్ ఇచ్చారు.  జూబ్లీహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియో పరిసరాల్లో ఆంక్షలు విధించారు. స్టూడియో బయట భారీ బారికేడ్స్ ఏర్పాటు చేశారు. 300 మంది పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. 

Also Read: నేడే ‘బిగ్ బాస్-8’ లాస్ట్ డే.. 300 మంది పోలీసులతో భారీ బందోబస్తు!

అలా చేస్తే కఠిన చర్యలు తప్పవు..

అభిమానులు ఎవరూ స్టూడియో దగ్గరకు రావొద్దని పోలీసులు తెలిపారు. కార్యక్రమం పూర్తయిన అనంతరం ఊరేగింపులు, ర్యాలీలు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరిగినా వాటికీ బిగ్ బాస్ నిర్వహకులదే బాధ్యత అని పోలీసులు పేర్కొన్నారు. 

Also Read :  2024లో లాంచ్ అయిన కిర్రాక్ ఫ్లాగ్ షిప్ ఫోన్లు.. మొత్తం ఎన్నంటే?

గతేడాది పల్లవి ప్రశాంత్ విన్నర్ అయిన తర్వాత స్టూడియో నుంచి బయటకు వచ్చాడు. ఈ క్రమంలో అభిమానుల అత్యుత్సాహంతో పరిస్థితి అదుపుతప్పింది. దీంతో ఏడు ఆర్టీసీ బస్సులు, పలు కార్ల అద్దాలు ధ్వంసం అయ్యాయి. దీంతో ఈసారి అలాంటి ఘటనలు జరగకుండా పోలీసులు ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

Also Read : 'బిగ్ బాస్- 8' గ్రాండ్ ఫినాలే ఈ రోజే.. ప్రైజ్ మనీ ఎంతో తెలుసా?

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు