Block Buster HHVM: సంధ్యా థియేటర్ దగ్గర పవన్ ఫ్యాన్స్ హంగామా..అప్రమత్తంగా పోలీసులు

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ నటించిన హరిహర వీరమల్లు సినిమా ఈరోజు చాలాచోట్ల ప్రివ్యూలు పడ్డాయి. ఈ క్రమంలో హైదరాబాద్ సంధ్యా థియేటర్ దగ్గర సందడి నెలకొంది. అయితే పుష్ప 2 సంఘటనను దృష్టిలో పెట్టుకుని పోలీసులు అలెర్ట్ అయ్యారు. 

New Update
sandhya

Block Buster HHVM

Block Buster HHVM: ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల ప్రజలు హరిహర వీరమల్లు(Hari Hara Veera Mallu) ఊపుతో ఉన్నారు. పవర్ స్టార్ పవన్ కల్యాణ్(Pawan Kalyan) నటించిన సినిమా చాలా రోజులు తర్వాత విడుదల అవుతోంది. అది కూడా ఆయన డిప్యూటీ సీఎం అయ్యాక విడుదల అవుతున్న మొదటి సినిమా. దీంతో పవన్ ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. చాలాచోట్ల ర్యాలీలు, పాలాభిషేకాలతో హల్ చల్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఈరోజు రాత్రి 9.30కు చాలాచోట్ల హరిహర వీరమల్లు సినిమా ప్రివ్యూ(Hari Hara Veera Mallu Premiers) పడింది. హైదరాబాద్ లోనే ఈ షోలు ఎక్కువగా పడ్డాయి. అయితే సినిమాలకు ఫేమస్ అయిన ఆర్టీసీ క్రాస్ రోడ్ లోని సంధ్య థియేటర్(Sandhya Theater) వద్ద పవన్ ఫ్యాన్స్ భారీగా చేరుకున్నారు. దీంతో థియేటర్ ముందు ఎప్పటిలానే హంగామా నెలకొంది. 

Also Read: రష్యా మహిళను బహిష్కరించొద్దు : కర్ణాటక హైకోర్టు సంచలన తీర్పు

థియేటర్ దగ్గర భారీ బందోబస్తు..

కానీ పుష్ప 2 ఘటనను పోలీసులు ఇంకా మర్చిపోలేదు. దీంతో ఇప్పుడు హరిహర వీరమల్లు సినిమా ప్రివ్యూ సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా భారీగా బందోబస్తు నిర్వహిస్తున్నారు. కేవలం టికెట్ ఉన్న వారిని మాత్రమే థియేటర్ లోపలికి అనుమతిస్తున్నారు. థియేటర్ లోపల కూడా ఎలాంటి అల్లర్లు జరగకుండా కాపలా కాస్తున్నారు. థియేటర్ చుట్టుపక్కల జనాలు గుమిగూడకుండా అందరినీ పంపించేస్తున్నారు. ప్రివ్యూ అయిపోయిన తర్వాత ఫ్యాన్స్ హడావుడి చేయవచ్చిన పోలీసులు భావిస్తున్నారు. ర్యాలీలు నిర్వహించే అవకాశం ఉందని అంటున్నారు. అయితే అలాంటి వాటికి పర్మిషన్ ఇవ్వడం లేదని...ఈసారి ఎలాంటి తప్పు జరగకుండా చాలా స్ట్రిక్ట్ గా ఉంటున్నామని పోలీసులు చెబుతున్నారు. 

Also Read: అసలెక్కడా లేని దేశం...దానికో రాయబార కార్యాలయం..ఘజియాబాద్ లో హైటెక్ మోసం

Also Read: పెళ్లమా..? దయ్యమా..? భయ్యా.. భర్త పార్ట్ కొరికి మింగేసింది..

Advertisment
తాజా కథనాలు