/rtv/media/media_files/2025/01/12/naRMVzAW0hzcWA7vEFS4.jpg)
balakrishna nandamuri
నందమూరి బాలకృష్ణ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ 'డాకు మహారాజ్'. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం జనవరి 12న సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో అభిమానులు పండగ చేసుకుంటున్నారు.
సినిమాలో బాలయ్య ఎప్పటిలాగే తన పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ తో కుమ్మేశాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. థమన్ బీజీఎం మాములుగా లేదు.. బాక్సులు బద్దలు అంటూ టాక్ వస్తోంది. అంతేకాదు 'డాకు మహారాజ్' తో బాలయ్య ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ హిట్ చేరిందని కాలర్ ఎగరేస్తూ పోస్టులు పెడుతున్నారు అభిమానులు.
Also Read : 'డాకు మహారాజ్' థియేటర్ లో పగిలిపోయిన సౌండ్ బాక్సులు.. సినిమా నిలిపివేత
డాకు మహారాజ్ చిత్రాన్ని విజయవంతం చేసిన ప్రతి ఒక్క అభిమానికి హృదయపూర్వక ధన్యవాదములు తెలిపిన నందమూరి బాలయ్య బాబు
Posted by Ranjith Chowdary Nallamala on Sunday, January 12, 2025
అటు మాస్ ఆడియన్స్ సైతం సినిమాకి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. దీంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఇదిలా ఉంటే ఓ వీరాభిమాని స్వయంగా బాలయ్యకు ఫోన్ చేసి సినిమాకి వస్తున్న రెస్పాన్స్ గురించి మాట్లాడారు.
ఖమ్మం జిల్లా బాలయ్య ఫ్యాన్స్ అసోసియేషన్ అధ్యక్షుకుడు నల్లమల రంజిత్.. స్వయంగా బాలయ్యతో ఫోన్ లో మాట్లాడారు. సినిమా చాలా బాగుందని, మహిళల నుంచి మంచి రెస్పాన్స్ వస్తుందని చెప్పారు. దానికి బాలయ్య చాలా సంతోషంగా ఉందని, ఇదంతా ప్రేక్షకుల ఆశీస్సుల వల్లే అని, అభిమానులే నా బలం అంటూ అభిమానితో బాలయ్య ఫోన్ కాల్ మాట్లాడుతున్న వీడియో సామజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ వీడియోను బాలయ్య ఫ్యాన్స్ నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు.
Also Read : ఆరోగ్యంపై వార్తలు.. ఎట్టకేలకు నోరు విప్పిన విశాల్