Balakrishna: బాలయ్య కారుకు ఫ్యాన్సీ నంబరు.. ఎన్ని లక్షలు చెల్లించాడంటే!

నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన కారుకు ఫ్యాన్సీ నెంబరు దక్కించుకున్నారు. రవాణా శాఖ నిర్వహించిన వేలంలో రూ.7.75లక్షలు చెల్లించి TG 09 F 0001 సొంతం చేసుకున్నారు. ఖైరతాబాద్‌ జోన్‌లో ఒకే రోజు రూ.37,15,645 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. 

New Update
Balakrishna: భగవంత్ కేసరి హ్యాట్రిక్ హిట్ కన్ఫామ్..!!

Balakrishna gets fancy number for car

Balakrishna: నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ తన కారుకు ఫ్యాన్సీ నెంబరు దక్కించుకున్నారు. రవాణా శాఖ నిర్వహించిన వేలంలో రూ.7.75లక్షలు చెల్లించి TG 09 F 0001 సొంతం చేసుకున్నారు. ఖైరతాబాద్‌ జోన్‌లో ఒకే రోజు రూ.37,15,645 ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు. 

ఒకేరోజు భారీ ఆదాయం..

ఈ మేరకు త్వరలో బాలయ్యబాబు రిజిస్ట్రేషన్‌ చేసుకోబోయే BMW కారుకోసం ఆన్‌లైన్‌లో వేదికగా జరిగిన వేలంలో పాల్గొన్నట్లు తెలిపారు. ఇక రూ.లక్షకుపైన పలికిన ఫ్యాన్సీ నంబర్లకు వచ్చిన ఆదాయ వివరాలను జేఏసీ రమేష్‌ వెల్లడించారు. TG 09 F0009 నంబరు కమలాలయ హైసాఫ్ట్‌ సంస్థ దక్కించుకుంది. F 0005 నంబరును జెట్టి ఇన్‌ఫ్రా ప్రాజెక్ట్స్‌ రూ.1,49,999సొంతం చేసుకుంది.

Also read: Woman Elopes: 43ఏళ్ల వయసులో ఇదేం పని ఛీఛీ.. వీయ్యంకుడితో లేచిపోయిన మహిళ

అలాగే F 0007 నంబరు శ్రీనివాస్‌ నాయుడు రూ.1,37,779లకు దక్కించుకున్నారు. F 0019 నంబరు నేత్రావతి బలగప్ప శివలిప్ప రూ.60వేలకు సొంతం చేసుకున్నారు. F 0099 నంబరు కాన్కాప్‌ ఎలక్ట్రికల్స్‌ సంస్థ రూ.4,75,999లకు దక్కించుకుంది. గత సిరీస్‌ TG 09 E999 నంబరు ఈకో డిజైన్‌ స్టూడియో రూ.99,999లకు సొంతం చేసుకుంది. 

Also read: Hydra: TDP ఎమ్మెల్యేకు హైడ్రా షాక్.. 20 ఎకరాల్లో నిర్మాణాల కూల్చివేత

fancy-numbers | car | telugu-news | today telugu news 

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు