Daaku Maharaj: 'డాకు మహారాజ్' ప్రీక్వెల్.. నిర్మాత సంచలన ప్రకటన

బాలయ్య 'డాకు మహారాజ్' నేడు థియేటర్స్ లో రిలీజై హిట్ టాక్ సొంతం చేసుకుంది. ఈ నేపథ్యంలో మూవీటీమ్ ప్రెస్ మీట్ నిర్వహించారు. ఇందులో నిర్మాత నాగవంశీ..'డాకు మహారాజ్' ఫ్రీక్వెల్ చేయాలని అనుకుంటున్నాం. ప్రీక్వెల్ కోసం ఓ ఐడియా కూడా ఉందని అన్నారు.

New Update
daaku maharaj prequel

balakrishna nagavamsi

వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ అందుకున్న బాలయ్య.. నేడు(జనవరి 12) 'డాకు మహారాజ్' మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు. హై వోల్టేజ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రం మొదటి షో నుంచే ఆడియన్స్ నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. 

సినిమాలో బాలయ్య ఎప్పటిలాగే తన పవర్ ఫుల్ డైలాగ్స్, యాక్షన్ తో కుమ్మేశాడని ఫ్యాన్స్ చెబుతున్నారు. థమన్‌ బీజీఎం మాములుగా లేదు.. బాక్సులు బద్దలు అంటూ టాక్ వస్తోంది. అంతేకాదు దర్శకుడు బాబీ సినిమాలో బాలయ్యను చాలా కొత్తగా చూపించారని, ముఖ్యంగా విజువల్స్ అద్భుతంగా ఉన్నాయని చెబుతున్నారు. 

Also Read : ఆరోగ్యంపై వార్తలు.. ఎట్టకేలకు నోరు విప్పిన విశాల్

అటు మాస్ ఆడియన్స్ సైతం సినిమాకి పాజిటివ్ రివ్యూస్ ఇచ్చారు. దీంతో నందమూరి అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. సినిమాకి వస్తున్న రెస్పాన్స్ కు ఆనందం వ్యక్తం చేస్తూ చిత్ర బృందం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా అభిమానులకు, ప్రేక్షకులను కృతజ్ఞతలు తెలిపారు.

అలాగే ప్రెస్ మీట్ లో  దర్శకుడు బాబీ మాట్లాడుతూ, " 2023 సంక్రాంతి వాల్తేరు వీరయ్యతో సక్సెస్ అందుకున్నాను. ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ తో వచ్చాను. సంక్రాంతి నాకు ఒక ప్రత్యేకమైన పండుగలా మారింది. ఈ చిత్రంలో తమన్ అందించిన సంగీతం, విజయ్ కార్తీక్ అందించిన సినిమాటోగ్రఫీ.. ఇలా  అద్భుతమైన టీమ్ వల్లే సినిమాకు ఇంతమంచి అవుట్‌పుట్‌ వచ్చింది..' అంటూ చెప్పుకొచ్చారు.

Also Read : 'డాకు మహారాజ్' థియేటర్ లో పగిలిపోయిన సౌండ్ బాక్సులు.. సినిమా నిలిపివేత

ప్రీక్వెల్ ఉంది..

ఇక 'డాకు మహారాజ్' కు సీక్వెల్ ఏమైనా ఉంటుందా? అని ప్రశ్నించగా,..' సీక్వెల్ చేయాలనే ఆలోచన లేదు. కానీ ఫ్రీక్వెల్ చేయాలని అనుకుంటున్నాం. ప్రీక్వెల్ కోసం బాబీ దగ్గర ఓ ఐడియా ఉంది. ఆ ఐడియా నాకు చాలా నచ్చింది. దానిపై  దానిమీద వర్కౌట్ చేస్తా..' అని నిర్మాత నాగ వంశీ వెల్లడించారు. ఆయన చెప్పినదాన్ని బట్టి రానున్న రోజుల్లో 'డాకు మహారాజ్' కు ప్రీక్వెల్ ఉంటుందని అర్థమవుతుంది.

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు