Daaku Maharaaj: ‘డాకు మహారాజ్’.. బాలయ్య దబిడి దిబిడి దుమ్ము లేపేసింది

బాలకృష్ణ ‘డాకు మహారాజ్’ మూవీ నుంచి మూడో సాంగ్ రిలీజ్ అయింది. దబిడి దిబిడి అంటూ సాగే ఈ సాంగ్ అదిరిపోయింది. బాలయ్యతో ఊర్వశీ రౌతేలా స్టెప్పులు కుమ్మేశాయి. నందమూరి ఫ్యాన్స్ ఈ సాంగ్‌కు ఫిదా అయిపోయారు. ప్రస్తుతం ఈ సాంగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.

New Update
Daaku Maharaaj

Daaku Maharaaj

బాలయ్య బాబు నటిస్తోన్న ‘డాకు మహారాజ్’ మూవీ నుంచి అదిరిపోయే అప్డేట్ వచ్చింది. మేకర్స్ ఈ సినిమా నుంచి మూడో సాంగ్‌ను రిలీజ్ చేశారు. ‘దబిడి దిబిడి’ అంటూ సాగే ఈ సాంగ్ ఓ రేంజ్‌లో ఉంది. బాలయ్య బాబు - ఊర్వశి రౌతేలా డాన్స్ ఆహా ఓహో అనేలా ఉంది. ఈ సాంగ్ మాస్ బీట్‌‌తో దుమ్ము దులిపేసింది. 

మాస్ బీట్ అదుర్స్

మ్యూజిక్ డైరెక్టర్ థమన్.. బాలయ్య బాబుకు సరిపడా సాంగ్‌ కంపోజ్ చేసి తన బీట్‌తో సినీ ప్రియుల్లో సరికొత్త ఊపు తెప్పించాడు. ఈ సాంగ్ విన్నంత సేపు బాడీ షేక్ అయిందనే చెప్పాలి. ఊర్వశీ రౌతేలా తన స్టెప్పులతో కుమ్మేసింది. చిరుతో ‘వాల్తేరు వీరయ్య’ మూవీలో బాస్ పార్టీ సాంగ్‌కు స్టెప్పులేసి ఒక ఊపు ఊపేసిన ఊర్వశీ.. ఇప్పుడు బాలయ్య మూవీలో దబిడి దిబిడి అనే సాంగ్‌కు అదరగొట్టేసింది. మొత్తంగా ఈ సాంగ్ యూట్యూబ్‌ని షేక్ చేస్తోంది. 

ఇది కూడా చూడండి: ఏపీ దేవాదాయ శాఖలో ఉద్యోగాలు.. అర్హత, చివరి తేదీ వివరాలివే!

ఇకపోతే ఈ చిత్రాన్ని డైరెక్టర్ బాబీ కొల్లి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, గ్లింప్స్, టీజర్స్ భారీ స్థాయిలో హైప్ పెంచేశాయి. ఇటీవల విడుదలైన టీజర్‌లో బాలయ్య బాబు లుక్ అందరినీ ఆకట్టుకుంది. అలాగే బాలయ్య డైలాగ్స్ సైతం మైమరపించాయి. 

ఇది కూడా చూడండి: ప్రయాణికులకు అదిరిపోయే గిఫ్ట్‌ ఇచ్చిన ఎయిర్‌ ఇండియా..

ఈ చిత్రాన్ని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నిర్మాత నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని శ్రీకరా స్టూడియోస్ సమర్పిస్తోంది. ఇక అన్ని పనులు పూర్తి చేసుకుని ఈ సినిమా సంక్రాంతి సందర్భంగా జనవరి 12న గ్రాండ్ లెవెల్లో విడుదల కానుంది. ఇప్పటి వరకు ఫ్లాప్ లేని బాలయ్యకు ఈ సినిమా ఫ్లాప్‌నిస్తుందా? లేక సంక్రాంతి బరిలో హిట్‌గా నిలిచి మరింత జోష్‌‌నిస్తుందా? అనేది చూడాలి. 

ఇది కూడా చూడండి: గర్ల్స్ హాస్టల్ బాత్‌రూమ్‌లో వీడియోలు.. విద్యార్థినుల ఆందోళన

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు