Akhanda 2 Jukebox: 'అఖండ 2' జ్యూక్‌బాక్స్ అవుట్.. మొత్తం ఎన్ని పాటలంటే..?

డిసెంబర్ 5న విడుదల కానున్న అఖండ 2 - తాండవంలో నుండి 9 పాటలతో కూడిన జ్యూక్‌బాక్స్‌ను విడుదల అయ్యింది. బాలకృష్ణ హీరోగా, బోయపాటి శ్రీను దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రంలోని పాటలు అభిమానుల్లో భారీ ఆసక్తిని పెంచుతున్నాయి.

New Update
Akhanda 2 Jukebox

Akhanda 2 Jukebox

Akhanda 2 Jukebox:డిసెంబర్ 5న విడుదలకు సిద్ధంగా ఉన్న అఖండ 2 - తాండవం చిత్రంపై అభిమానుల్లో భారీ ఆసక్తి నెలకొంది. నందమూరి బాలకృష్ణ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాకు బోయపాటి శ్రీను దర్శకత్వం వహిస్తున్నారు. అఖండ తొలి భాగం భారీ విజయాన్ని సాధించిన తర్వాత, రెండో భాగంపై ఇంకా పెద్ద అంచనాలు ఏర్పడ్డాయి.

చిత్ర విడుదలకు కేవలం కొన్ని రోజులు మాత్రమే ఉండగా, మూవీ టీమ్  అర్ధరాత్రి పూర్తి జ్యూక్‌బాక్స్‌ను రిలీజ్ చేసి అభిమానుల్లో ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. మొత్తం 9 ఎనర్జీటిక్ పాటలు ఈ ఆల్బమ్‌లో ఉన్నాయి. విడుదలైన వెంటనే ఈ పాటలకు  సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ వస్తోంది. - Tollywood news updates

Also Read :  పెళ్లి ఫొటోలు షేర్ చేసిన సమంత!

జ్యూక్‌బాక్స్‌లో ఉన్న పాటలు ఇవే!

1. అఖండ తాండవం
సింగర్: సర్వేపల్లి సిస్టర్స్
సాహిత్యం: కల్యాణ్ చక్రవర్తి

2. గంగాధర శంకరా
సింగర్: ఎస్. ఐశ్వర్య, ఎస్. సౌందర్య, సృతి రంజని
సాహిత్యం: అద్వితీయ వోజ్జల

3. శివ శివ
సింగర్: గొట్టె కనకవ్వ, సృతి రంజని
సాహిత్యం: కల్యాణ్ చక్రవర్తి

4. హర హర
సింగర్: ఎస్.పీ. చరణ్, శ్రీకృష్ణ
సాహిత్యం: కల్యాణ్ చక్రవర్తి

5. శంకర శంకర
సింగర్: వి. ఎం. మహాలింగం, దివ్య కుమార్, దీపక్ బ్లూ, అరుణ్ కౌండిన్య
సాహిత్యం: కల్యాణ్ చక్రవర్తి

జ్యూక్‌బాక్స్ విడుదలైన వెంటనే యూట్యూబ్, సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో కామెంట్లు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా భక్తిరసంతో కూడిన పవర్‌ఫుల్ వాయిస్‌లతో వచ్చిన పాటలు అఖండ అభిమానులకు ఎంతో నచ్చుతున్నాయి. మొదటి భాగంలా ఈ చిత్ర సంగీతం కూడా మాస్, క్లాస్ రెండింటినీ ఆకట్టుకునేలా ఉందనే అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.

డిసెంబర్ 5 విడుదలకు ముందే ఈ జ్యూక్‌బాక్స్ సినిమా హైప్‌ను మరింత పెంచింది. అఖండ - బాలకృష్ణ - బోయపాటి కాంబినేషన్ మళ్ళీ ఏ స్థాయి విజయాన్ని అందిస్తుందో చూడాల్సి ఉంది.

Also Read :  అందాల గేట్లు తెరిచిన 'కల్కి' బ్యూటీ.. చూస్తే చెమటలు పట్టాల్సిందే!

Advertisment
తాజా కథనాలు