Viral Video: వాడో అమ్మాయిల పిచ్చోడు.. కిందేసి తొక్కుతా! పికిల్స్ పాప, దువ్వాడ మాధురి గుసగుసలు!

బిగ్ బాస్ సీజన్ 9 గత సీజన్లతో పోలిస్తే కాస్త ఇంట్రెస్టింగ్ గా, ఆసక్తికరంగా సాగుతోంది. నిన్న రాత్రి జరిగిన ఎపిసోడ్ లో పికిల్స్ పాప రమ్య మోక్ష కళ్యాణ్ గురించి మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసింది.

New Update
chiiti pickles on kalyan

chiiti pickles on kalyan

Bigg Boss:  బిగ్ బాస్ సీజన్ 9 గత సీజన్లతో పోలిస్తే కాస్త ఇంట్రెస్టింగ్ గా, ఆసక్తికరంగా సాగుతోంది. ప్రతీ వారం ఆటలో కొత్త ట్విస్టులు, మలుపులతో ప్రేక్షకులను ఆకట్టుకుంటోంది. ఆరవవారం వైల్డ్ స్ట్రామ్ పేరుతో ఆరుగురు వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్స్ హాజ్ లోకి అడుగుపెట్టారు. దివ్వెల మాధురి, అలేఖ్య చిట్టి పికిల్స్ రమ్య మోక్ష, సీరియల్ నటుడు నిఖిల్ నాయర్, అయేషా, గౌరవ్ గుప్తా, శ్రీనివాస్ సాయి వైల్డ్ కార్డ్స్ గా వచ్చాయి. ఇక దివ్వెల మాధురి వచ్చిన మొదటి రోజే కళ్యాణ్ తో గొడవేసుకొని రచ్చ రచ్చ చేసింది. ఆ తర్వాత మళ్ళీ ఆమె కన్నీళ్లు పెట్టుకొని అందరికీ షాకిచ్చింది. 

పికిల్స్ పాప, మాధురి గుసగుసలు 

అయితే నిన్న రాత్రి జరిగిన ఎపిసోడ్ లో దివ్వెల మాధురి, పికిల్స్ పాప ఈ విషయం గురించి మాట్లాడుకున్నారు. ఈ క్రమంలో పికిల్స్ పాప రమ్య మోక్ష కళ్యాణ్ గురించి మాట్లాడుతూ సంచలన కామెంట్స్ చేసింది. రమ్య మోక్ష మాట్లాడుతూ.. కళ్యాణ్ అమ్మాయిల పిచ్చోడు.. అతడి ప్రవర్తన కాస్త డిఫెరెంట్ గా ఉంటుంది. తనూజ పై చేతులు వేసి తడుముతుంటాడు.. అది చూస్తే నాకెలాగో ఉంటుంది. నాతో కానీ, అదేవిధంగా ప్రవర్తిస్తే లాగి పెట్టి ఒక్కటి ఇచ్చేస్తా.. కిందేసి తొక్కేస్తా అంటూ సంచలన కామెంట్స్ చేసింది.

దీనికి దువ్వాడ మాధురి బదులిస్తూ.. తన ప్రొఫెషన్ ఏంటో కూడా మర్చిపోయి.. అమ్మాయిలతో ఇలా బిహేవ్ చేయడం బాగా లేదని చెప్పింది.  ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా.. ఇది చూసిన కళ్యాణ్ ఫ్యాన్స్ పికిల్స్ పాప పై మండిపడుతున్నారు. ఒకరి క్యారెక్టర్ గురించి అలంటి స్టేట్మెంట్స్ పాస్ చేస్తుంది అంటూ మండిపాడుతున్నారు. మరి హోస్ట్ నాగార్జున వీకెండ్ ఎపిసోడ్ దీని గురించి ఏమైనా మాట్లాడతారా? చూడాలి. 

Also Read: Bigg Boss 9 Telugu: ఆట మొదలెట్టిన దివ్వెల మాధురి.. భరణితో రచ్చ రచ్చ! బాల్ పట్టుకొని రీతూకి ఛాన్స్!

Advertisment
తాజా కథనాలు