Amitabh Bachchan : బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్‌కు ఖలిస్తానీ బెదిరింపులు.. భద్రత పెంపు!

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్ భద్రతపై కేంద్ర నిఘా సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల ఖలిస్తానీ అనుబంధ సంస్థ నుంచి బెదిరింపులు రావడంతో, ముంబైలోని ఆయన నివాసం వద్ద భద్రతను గణనీయంగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది.

New Update
amitabh

బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బచ్చన్(amitabh-bachchan) భద్రతపై కేంద్ర నిఘా సంస్థలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇటీవల ఖలిస్తానీ(khalistani-terrorist) అనుబంధ సంస్థ నుంచి బెదిరింపులు రావడంతో, ముంబైలోని ఆయన నివాసం వద్ద భద్రతను గణనీయంగా పెంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించినట్లు తెలుస్తోంది. అమితాబ్ బచ్చన్‌కు సిక్స్ ఫర్ జస్టిస్ అనే ఖలిస్తానీ సంస్థ నుంచి బెదిరింపులు వచ్చినట్లు సమాచారం. ఈ వివాదానికి ప్రధాన కారణం ప్రముఖ పంజాబీ గాయకుడు, నటుడు దిల్‌జిత్ దోసాంజ్ తో సంబంధం ఉన్న ఒక సంఘటన.

Also Read :  మాస్ మహారాజ్ 'మాస్ జాతర' హిట్టా? ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందంటే

ఇటీవల కౌన్ బనేగా క్రోర్‌పతి షోలో పాల్గొన్న దిల్‌జిత్ దోసాంజ్, గౌరవ సూచకంగా బిగ్‌ బీ అమితాబ్ బచ్చన్ కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. దిల్‌జిత్ చర్య 1984 నాటి సిక్కుల వ్యతిరేక హింసలో మరణించిన వారిని అవమానించినట్లేనని SFJ సంస్థ ఆరోపించింది. 1984 నాటి ఇందిరా గాంధీ హత్య తర్వాత జరిగిన హింసలో అమితాబ్ బచ్చన్ రక్తం బదులు రక్తం అనే నినాదాన్ని ఇచ్చి హిందూ గుంపులను ప్రేరేపించారని SFJ ఆరోపిస్తోంది. ఈ కారణంగానే దిల్‌జిత్ ఆయన పాదాలను తాకడాన్ని SFJ తీవ్రంగా వ్యతిరేకిస్తోంది.

భద్రతను భారీగా పెంపుదల

ఖలిస్తానీ సంస్థ అధినేత గుర్‌పత్వంత్ సింగ్ పన్నూన్ ఈ బెదిరింపులకు పాల్పడినట్లుగా నిఘా వర్గాలు గుర్తించాయి. ఈ పరిణామాల నేపథ్యంలో, భద్రతకు ముప్పు పొంచి ఉందనే అంచనాతో కేంద్ర ప్రభుత్వం ముంబైలోని అమితాబ్ బచ్చన్ నివాసం వద్ద భద్రతను భారీగా పెంపుదల చేయాలని నిర్ణయించింది. కేంద్ర నిఘా ఏజెన్సీలు ఈ బెదిరింపులను అత్యంత సీరియస్‌గా తీసుకుని, అమితాబ్ బచ్చన్‌కు గట్టి భద్రతను కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాయి.

Also Read :  ఘనంగా నారా రోహిత్ పెళ్లి.. ఫోటోస్ చూశారా..!

Advertisment
తాజా కథనాలు