Mass Jathara Review: మాస్ మహారాజ్ 'మాస్ జాతర' హిట్టా? ట్విట్టర్ రివ్యూ ఎలా ఉందంటే

రవితేజ శ్రీలీల జంటగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మాస్ జాతర నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైంది. మొదటి షో నుంచే సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తోంది.

New Update
raviteja

raviteja

Mass Jathara Review:  రవితేజ శ్రీలీల జంటగా నటించిన మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ మాస్ జాతర నేడు థియేటర్స్ లో గ్రాండ్ గా విడుదలైంది.  సోషల్ మీడియాలో ఈ సినిమాకు  పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. చాలా కాలం తర్వాత రవితేజను వింటేజ్ మాస్ మహారాజ్ స్టైల్లో చూశామని ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు.  'ధమాకా'  తర్వాత మాస్ జాతర రవితేజకు మరో మంచి హిట్టు కాబోతుందని చెబుతున్నారు. ట్విట్టర్ లో 'మాస్ జాతర ' రివ్యూస్ ఎలా ఉన్నాయో ఇక్కడ చూద్దాం.. 

మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్

సినిమా పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్ టైనర్ అని..  రవితేజ మార్క్ కామెడీ, హై-వోల్టేజ్ యాక్షన్ సీన్లు బాగా  నచ్చాయని చెబుతున్నారు. ఆయన డైలాగ్ డెలివరీ, ఎనర్జిటిక్ పర్ఫార్మెన్స్, యాక్షన్ బ్లాక్స్ సినిమాకే హైలైట్ గా నిలిచాయని కొనియాడుతున్నారు.  సినిమా ఫస్ట్ హాఫ్, ముఖ్యంగా రవితేజ ఇంట్రడక్షన్ సీన్, కామెడీ ట్రాక్ బాగా కనెక్ట్ అయ్యాయని అంటున్నారు. ఇక ఇంటర్వెల్ బ్లాక్ థియేటర్ ను  షేక్ చేసేలా సాలిడ్ గా ఉందని చెబుతున్నారు. 

సినిమాలో శ్రీలీల గ్లామర్, డాన్సులు సినిమాకు ప్లస్ అయ్యాయని.. ధమాకా తర్వాత రవితేజ- శ్రీలీల కాంబో మళ్ళీ  బాగా వర్కౌట్ అయ్యిందని అభిప్రాయపడుతున్నారు.  ఫస్ట్ హాఫ్ రవితేజ ఇంట్రో సీన్, కామెడీ, యాక్షన్ బ్లాక్స్ తో గ్రిప్పింగ్  అనిపించినప్పటికీ.. సెకండ్ ఆఫ్ కొన్ని చోట్ల స్లోగా సాగిందని అంటున్నారు. అలాగే సెకండ్ ఆఫ్లో కొన్ని కీలకమైన ఎమోషనల్ సీన్స్, క్లైమాక్స్  మెప్పించాయని చెబుతున్నారు. విలన్ పాత్రలో నవీన్ చంద్ర నటనకు మంచి మార్కులు పడ్డాయి.  

మొదటి సినిమా అయినప్పటికీ.. డైరెక్టర్ భాను బోగరపు సినిమాను బాగా హ్యాండిల్ చేశాడని ప్రశంసిస్తున్నారు. రవితేజ అభిమానులు ఏం ఆశిస్తారో ఆ ఎలిమెంట్స్ అన్నీ పర్‌ఫెక్ట్‌గా క్యాచ్ చేశాడని అంటున్నారు. భీమ్స్ మ్యూజిక్, బ్యాక్ గ్రౌండ్ స్కోర్ సన్నివేశాలను మరింత హైలైట్ చేసిందని చెబుతున్నారు.  మొత్తంగా  'మాస్ జాతర'  రవితేజ అభిమానులకు ఒక మాస్ ఫెస్టివల్‌లా ఉందని, రొటీన్ మాస్ ఫార్ములా నచ్చే ప్రేక్షకులను ఈ సినిమా తప్పకుండా మెప్పిస్తుందని  ట్విట్టర్ టాక్. 

Also Read: Faria Abdullah: ఉఫ్.. నెట్టింట సెగలు పుట్టిస్తున్న పొడువుకాళ్ల సుందరి.. చిట్టీ హాట్ ఫొటో షూట్!

Advertisment
తాజా కథనాలు