/rtv/media/media_files/2025/08/04/sobhita-dhulipala-pic-six-2025-08-04-18-48-02.jpg)
తమిళ దర్శకుడు పా .రంజిత్ డైరెక్షన్ లో 'వెట్టువం' అనే సినిమా చేస్తున్నట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుంది.
/rtv/media/media_files/2025/05/03/Lmr4yIDTVtaeiHDS5muK.jpg)
ఇందులో దినేష్ హీరోగా నటిస్తున్నారు. హీరో ఆర్య కూడా ఒక కీలక పాత్ర పోషిస్తున్నారట.
/rtv/media/media_files/2025/08/04/sobhita-dhulipala-pic-five-2025-08-04-18-48-02.jpg)
దర్శకుడు పా. రంజిత్ తమిళ్లో రజినీకాంత్ కబాలీ, , 'కాలా', 'మద్రాస్', తంగలాన్ వంటి విభిన్నమైన చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు పొందారు. దీంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.
/rtv/media/media_files/2024/12/12/sobhita-dhulipala.jpg)
నాగ చైతన్యతో పెళ్లి తర్వాత శోభిత చేస్తున్న తొలి సినిమా కావడంతో.. ఇందులో ఆమె పాత్ర ఎలా ఉండబోతుందా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు అక్కినేని అభిమానులు.
/rtv/media/media_files/2024/12/12/sobhita-dhulipala123456.jpg)
ఇంతకముందు తమిళ్లో శోభిత మణిరత్నం 'పొన్నియన్ సెల్వన్' సినిమాలో నటించింది. కానీ ఇందులో శోభిత మెయిన్ లీడ్ గా నటించలేదు. ఇప్పుడు తమిళ్లో మొదటిసారి మెయిన్ హీరోయిన్ గా సినిమా చేస్తున్నారు.
/rtv/media/media_files/2025/08/04/sobhita-dhulipala-pic-three-2025-08-04-18-48-02.jpg)
ఫ్యూచరిస్టిక్ సైన్స్ ఫిక్షన్ డ్రామాగా 'వెట్టువం' సినిమా రూపొందుతోంది. ఇందులో శోభిత పాత్ర చాలా శక్తివంతంగా.. యాక్షన్ కోణంలో సాగుతుందని తెలుస్తోంది.
/rtv/media/media_files/2024/12/12/sobhita-dhulipala1234.jpg)
కొద్దిరోజులుగా శోభిత తల్లి కాబోతున్నట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరిగింది. ఇప్పుడు ఈ సినిమా ప్రకటనతో ఆ పుకార్లకు చెక్ పెట్టింది. ఫ్యామిలీ లైఫ్ తో పాటు తన కెరీర్ పై ఫోకస్ పెట్టినట్లు స్పష్టం చేసింది.