/rtv/media/media_files/2025/06/04/0EeqkAEmrakFrs3f29G6.jpg)
allu ayaan emotional on rcb winning ipl trophy
IPL Final 2025: RCB 18 ఏళ్ళ తర్వాత ఎట్టకేలకు ఐపీఎల్ ట్రోఫీ గెలవడంతో ఫ్యాన్స్ ఆనందానికి హద్దులేవు. సోషల్ మీడియా అంతా ఆర్సీబీ విన్నింగ్ మూమెంట్స్ తో నిండిపోయింది. అభిమానుల నుంచి సెలెబ్రెటీల వరకు సంబరాలు చేసుకుంటున్నారు. కొంతమంది వీరాభిమానులు అయితే.. ఏకంగా ఏడ్చేశారు. 18 ఏళ్ళ తర్వాత తమ కళ నెరవేరిందని ఎమోషనల్ అవుతున్నారు. స్టార్ హీరో అల్లు అర్జున్ కుమారుడు అల్లు అయాన్ RCB విజయంతో తీవ్ర భావోద్వేగానికి గురయ్యాడు.
Also Read: Nushrratt Bharuccha: వర్షపు నీటి జల్లుల్లో బాలీవుడ్ బ్యూటీ అందాల ఆరబోత.. ఫొటోలు చూస్తే మతిపోతుంది
ఏడ్చేసిన అల్లు అయాన్
ఇందుకు సంబంధించిన వీడియోను అల్లు అర్జున్ సోషల్ మీడియా వేదికగా పంచుకున్నారు. రాత్రి బన్నీతో కలిసి లైవ్ మ్యాచ్ వీక్షణచిన అయాన్ RCB కప్ గెలవగానే ఐ లవ్ కోహ్లీ, ఐ లైక్ కోహ్లీ అంటూ కిందపడి ఏడ్చేశాడు. కోహ్లీ కప్ గెలిచాడనే ఆనందంతో ఎగిరిగంతేశాడు. అల్లు అర్జున్ ఈ వీడియోను షేర్ చేస్తూ.. 'ఫ్యాన్ బాయ్ మూమెంట్' అని రాసుకొచ్చారు. దీంతో అల్లు అయాన్ కింగ్ కోహ్లీకి పెద్ద ఫ్యాన్ అని తెలుస్తుంది.
Also Read: HariHara VeeraMallu: పవర్ స్టార్ ఫ్యాన్స్ కి మరోసారి షాక్! 'హరిహరవీరమల్లు' పై కీలక అప్డేట్
అభిమానులు మాత్రమే కాదు కోహ్లీ, ఆర్‌సిబి టీమ్ మొత్తం ఎంతో ఎమోషనల్ అయ్యారు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సిబి) పంజాబ్ కింగ్స్‌పై ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించింది. 18 సంవత్సరాలు పాటు ఆర్‌సిబి ఫ్రాంచైజీ తరపున ఆడిన విరాట్ ఈ అద్భుతమైన విజయం తర్వాత కన్నీళ్లు పెట్టుకోవడం అభిమానులను భావోద్వేగానికి గురిచేసింది.
Also Read: Nushrratt Bharuccha: వర్షపు నీటి జల్లుల్లో బాలీవుడ్ బ్యూటీ అందాల ఆరబోత.. ఫొటోలు చూస్తే మతిపోతుంది