సంధ్య థియేటర్ ఘటనలో అల్లు అర్జున్‌కి బిగ్ రిలీఫ్ అందింది. నాంపల్లి కోర్టు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేసింది. ఇరువైపుల వాదనలు విన్న కోర్టు అల్లు అర్జున్‌కు రూ.50 వేలు, రెండు పూచీకత్తులపై బెయిల్ మంజూరు చేసింది. దీంతో బన్నీ ఫ్యాన్స్ సంబురాలు చేసుకుంటున్నారు. రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దు Also Read : ఆ ఇద్దరు మంత్రులు ఔట్.. సీఎం రేవంత్ సంచలన నిర్ణయం! కాగా ఈ కేసులో ఇప్పటికే అరెస్ట్ అయి మధ్యంతర బెయిల్ మీద బయటకు వచ్చిన అల్లు అర్జున్‌కు రెగ్యులర్ బెయిల్ ఇవ్వొద్దని పోలీసులు నాంపల్లి కోర్టును ఇటీవల కోరారు. అతను డబ్బు, పలుకుబడి ఉన్న వ్యక్తి అని.. బెయిల్ ఇస్తే సాక్షులను ప్రభావితం చేసే అవకాశం ఉందని పేర్కొన్నారు. దీని కారణంగా కేసు మొత్తం తారు మారు అవుతుందని.. అందుకే అతనికి రెగ్యులర్ బెయిల్ ఇవ్వకూడదని పోలీసులు కోరారు. అంతేకాకుండా అంతకు ముందు అల్లు అర్జున్ పీఎస్‌లో కూడా తమకు సహకరించలేదని అన్నారు. అందుకే అరెస్ట్ చేశామని పోలీసులు తెలిపారు. ఇప్పుడు బెయిల్ ఇస్తే ఇదే పరిస్థితి మళ్ళీ ఎదురవుతుందని.. కేసుకు అస్సలు సహకరించే అవకాశం ఉందడదని పోలీసులు వాదించారు. సంధ్యా థియేటర్ తొక్కిసలాట కేసులో దర్యాప్తు ఇంకా కొనసాగుతున్నందునే బెయిల్ వద్దంటున్నామని పోలీసులు కోరారు. అయినా ఇలాంటి సమయంలో అల్లు అర్జున్‌కు కోర్టు బెయిల్ మంజూరు చేయడం గమనార్హం అనే చెప్పాలి. Also Read: సోషల్ మీడియా ఇన్‌ప్లుయోన్సర్ తో సింగర్ అర్మాన్ మాలిక్ పెళ్లి.. ఫొటోలు వైరల్ థియేటర్ యాజమాన్యానికి నోటీసులు మరోవైపు సంధ్య థియేటర్‌లో జరిగిన ఘటనా నేపథ్యంలో పోలీసులు థియేటర్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. 'పుష్ప 2' ప్రీమియర్ షో కోసం అల్లు అర్జున్ తన కుటుంబసభ్యులతో పాటు హీరోయిన్ రష్మిక థియేటర్‌కు హాజరయ్యారు. ఈ విషయం తెలిసిన అభిమానులు పెద్ద సంఖ్యలో థియేటర్ వద్దకు చేరుకోవడంతో భారీ గందరగోళం నెలకొంది. ఆ హడావిడిలో తొక్కిసలాట జరగ్గా.. దురదృష్టవశాత్తు ఒకరు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై స్పందించిన చిక్కడపల్లి పోలీసులు సంధ్య థియేటర్‌కు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. "తొక్కిసలాట కారణంగా ప్రాణనష్టం జరిగిన నేపథ్యంలో థియేటర్ లైసెన్స్‌ను ఎందుకు రద్దు చేయకూడదో వివరించండి" అని నోటీసుల్లో పేర్కొన్నారు. నోటీసులకు వారం రోజుల్లో సమాధానం ఇవ్వకపోతే, లైసెన్స్ రద్దు చేస్తామంటూ హెచ్చరించారు. Also Read: కుప్ప కూలిన మరో విమానం.. ఇద్దరు మృతి.. 18 మందికి సీరియస్ 6 పేజీల వివరణాత్మక లేఖ ఈ నోటీసుల నేపథ్యంలో థియేటర్ యాజమాన్యం పోలీసులకు 6 పేజీల వివరణాత్మక లేఖను న్యాయవాదుల ద్వారా పంపించింది. అందులో " సంధ్య థియేటర్‌కు అన్ని అనుమతులు ఉన్నాయి. గత 45 ఏళ్లుగా థియేటర్ ఎలాంటి సమస్యలు లేకుండా నిర్వహిస్తున్నాం. Also Read: పుష్పగాడి బాక్సాఫీస్ రూల్.. నాలుగు వారాల్లో ఎన్ని కోట్లంటే .. దంగల్ రికార్డు బ్రేక్? ఇలాంటి ఘటన ఇంతకుముందు ఎప్పుడూ జరగలేదు. 'పుష్ప 2' ప్రీమియర్ సందర్భంగా థియేటర్‌లో 80 మంది ఉద్యోగులు విధుల్లో ఉన్నారు. అలాగే డిసెంబర్ 4, 5 తేదీల్లో మైత్రి మూవీస్ థియేటర్‌ను ఎంగేజ్ చేసుకున్నారు. గతంలో అనేక చిత్రాల విడుదల సందర్భంగా హీరోలు థియేటర్స్ కు హాజరయ్యారు. అప్పుడు ఎలాంటి ఇబ్బందులు తలెత్తలేదు" అని థియేటర్ యాజమాన్యం పేర్కొంది.