కెమెరా ముందు అల్లు అర్జున్ పచ్చి అబద్ధాలు! ఇదిగో ప్రూఫ్..జాతర సీన్ వరకు థియేటర్లోనే

సంధ్యా థియేటర్ ఘటనపై ప్రెస్ మీట్ నిర్వహించిన బన్నీ.. పోలీసులు తొక్కిసలాట గురించి చెప్పగానే మూవీ స్టార్ అయిన కాసేపటికే థియేటర్ నుంచి వెళ్లిపోయినట్లు చెప్పారు. కానీ, ఆరోజు ఆయన 2 గంటలకు పైగా థియేటర్ లోనే ఉన్నట్లు ప్రస్తుతం నెట్టింట వీడియోలు వైరలవుతున్నాయి.

author-image
By Archana
New Update
allu arjun Sandhya incident

Photograph: allu arjun

Allu Arjun:  అసెంబ్లీ వేదికగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంధ్యా థియేటర్ ఘటనకు సంబంధించి అల్లు అర్జున్ తీరుపై సంచలన చేయడం రాష్ట్రవ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. అల్లు అర్జున్ నిర్లక్ష్యం కారణంగానే ఓ కుటుంబం నష్టపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.  తొక్కిసలాట గురించి పోలీసులు అధికారులు చెప్పిన తర్వాత కూడా అర్లు అర్జున్ సరిగా స్పందించలేదని ఫైర్ అయ్యారు. దీంతో  అల్లు అర్జున్ ఈ వ్యాఖ్యలపై  ప్రెస్ మీట్ నిర్వహించారు. 

ఇది కూడా చదవండి:TS: పోలీసులు పర్మిషన్ ఇచ్చారో లేదో ఆయనకు తెలుసు–మంత్రి శ్రీధర్ బాబు

జాతర సీన్ వరకు థియేటర్ లోనే.. బన్నీ అబద్దాలు 

అయితే ఈ ప్రెస్ మీట్ లో అల్లు అర్జున్ చెప్పిన సమాధానాలకు సంబంధించి నెట్టింట ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు బన్నీ నుంచి ఇన్ని పచ్చి అబద్ధాలా? అంటూ కామెంట్లు చేస్తున్నారు. ప్రెస్ మీట్ లో బన్నీ..  పోలీసులు తొక్కిసలాట జరుగుతుందని చెప్పగానే.. సినిమా స్టార్ట్ అయిన కాసేపటికి తన వైఫ్ తో పాటు థియేటర్ నుంచి వెళ్లిపోయినట్లు తెలిపారు. కానీ, ఆరోజు ఆయన 2 గంటలకు పైగా థియేటర్ లోనే ఉన్నట్లు ప్రస్తుతం నెట్టింట వీడియోలు వైరల్ అవుతున్నాయి. దీంతో  సినిమా స్టార్ట్ అయిన కాసేపటికే వెళ్లిపోయానని చెప్పిన అల్లు అర్జున్ ..  మరి ఇంటర్వెల్ తర్వాత వచ్చే జాతర సీన్ ఎలా ఎంజాయ్ చేస్తున్నారు?  అంటూ నెటిజన్లు వీడియోని షేర్ చేస్తున్నారు.

Also Read: అల్లు అర్జున్ కు బిగుసుకుంటున్న ఉచ్చు.. మరికొద్ది సేపట్లో ఏసీపీ కీలక ప్రెస్ మీట్!

Advertisment
తాజా కథనాలు