ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటించిన 'పుష్ప2' బాక్సాఫీస్ దగ్గర సంచలన విజయం అందుకున్న విషయం తెలిసిందే. సినిమా ఇంత పెద్ద హిట్ అవ్వడంలో దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ ప్రధాన పాత్ర పోషించింది. రిలీజ్ కు పాటలు చార్ట్ బస్టర్స్ గా నిలిచాయి. ముఖ్యంగా "సూసేకి అగ్గిరవ్వ మాదిరి ఉంటాడే నా సామి" సాంగ్ లోని హుక్ స్టెప్స్ సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అయ్యాయి. ఇక సినిమా విడుదలయ్యాక ఈ పాటకు ఆదరణ మరింత పెరిగింది. ఈ పాటను గణేష్ ఆచార్య కంపోజ్ చేశారు. కాగా ఈ సాంగ్ కి శ్రష్టి వర్మ.. అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ గా పని చేసింది. దాని రిహార్సల్ వీడియో నెట్టింట వైరల్ గా మారింది. Also Read : ఆరు సెంటర్లలో 100 రోజులు.. 'దేవర' సంచలన రికార్డ్ Sooseki Rehearsal 💃🕺❤️🔥@alluarjun @iamRashmika #Pushpa2 @PushpaMovie @ThisIsDSP pic.twitter.com/WIbUVl9fnH — TelanganaAlluArjunFC™ (@TelanganaAAFc) January 3, 2025 వీడియోలో ఆమె పలికించిన హావ భావాలు ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. సాంగ్ లో రష్మిక కంటే శ్రష్టి వర్మనే బాగా ఫెర్ఫార్మ్ చేసిందంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. ఇక శ్రష్టి వర్మ విషయానికొస్తే.. 'ఢీ' జోడి అనే డ్యాన్స్ షోతో తన కెరీర్ స్టార్ట్ చేసి.. డ్యాన్సర్ గా తన టాలెంట్ ను ప్రూవ్ చేసుకుంది. ఆ తర్వాత శేఖర్ మాస్టర్, జానీ మాస్టర్ లాంటి టాప్ కొరియోగ్రాఫర్స్ దగ్గర అసిస్టెంట్ గా పని చేసింది. ప్రస్తుతం కొరియోగ్రాఫర్ గా సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. Also Read : 'గేమ్ ఛేంజర్' ట్రైలర్ కు భారీ రెస్పాన్స్.. 24 గంటల్లోనే అన్ని వ్యూసా?