SSMB29: రికార్డులకు తెరలేపే కాంబినేషన్.. మహేశ్‌కు జోడీగా స్టార్ హీరోయిన్!

రాజమౌళి- మహేష్ SSMB29 సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. ఈ సినిమాలో మహేష్ సరసన బాలీవుడ్ స్టార్ హీరోయిన్ ప్రియాంక చోప్రా నటించనున్నట్లు తెలుస్తోంది. అయితే ఆ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు.

New Update
ssmb29 update

ssmb29 update

Priyanka chopra:  బాహుబలి, ఆర్ఆర్ఆర్ వంటి బ్లాక్బస్టర్లతో పాపులర్ అయిన రాజమౌళి, తన తదుపరి ప్రాజెక్టు కోసం రెడీ అవుతున్న సంగతి తెలిసిందే. మహేష్ బాబు హీరోగా పాన్ ఇంటర్నేషనల్ ప్రాజెక్ట్ గా ఇది రాబోతోంది. ఇప్పుడీ సినిమా నుంచి ఫ్రెష్ అప్ డేట్ వచ్చింది.  వచ్చే ఏడాది ఏప్రిల్ నుంచి ఈ సినిమా సెట్స్ పైకి రానుంది. 

ALSO READ: డెడ్ బాడీ పార్శిల్ కేసులో బిగ్ ట్విస్ట్.. శవం దొరకలేదని అమాయకుణ్ని హతమార్చారు?

ప్రియాంక చోప్రా 

ఇంటర్నేషనల్ యాక్షన్- అడ్వెంచర్ గా రాబోతున్న ఈ భారీ బడ్జెట్ సినిమాలో మహేష్ బాబు సరసన ప్రియాంక చోప్రాను హీరోయిన్ గా తీసుకున్నారు. అయితే ఆ విషయాన్ని ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. ఈ చిత్రాన్ని భారతదేశం, అమెరికా, ఆఫ్రికన్ అటవీ ప్రాంతాల్లో షూటింగ్ చేయబోతున్నారు. 2026 చివరి వరకు ఈ సినిమా షూటింగ్ ఉంటుందని సమాచారం. 2027లో ఈ సినిమాను భారీ ఎత్తున విడుదల చేయాలని రాజమౌళి ప్లాన్ చేస్తున్నాడు. ఇంకా చెప్పాలంటే, హాలీవుడ్ సినిమాలతో పోటీగా ఈ చిత్రాన్ని విడుదల చేయాలనేది అతడి ప్లాన్. అందుకే ఇప్పట్నుంచే డిస్నీ, సోనీ లాంటి సంస్థలతో చర్చలు జరుపుతున్నాడు. ఇప్పటికే అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ప్రియాంక చోప్రాను ఈ ప్రాజెక్టులోకి తీసుకోవడం మేకర్స్ కు కలిసొచ్చే అంశం.

ALSO READ: కామారెడ్డిలో విషాదం..ఒకేసారి మహిళా కానిస్టేబుల్‌, కంప్యూటర్‌ ఆపరేటర్‌ మృతి..ఎస్సై అదృశ్యం!

Advertisment
తాజా కథనాలు