Vishwaksen: మాది 'A' సెర్టిఫికెట్ ఫిల్మ్.. ఎందుకంటే? 'లైలా' పై విశ్వక్ కామెంట్స్

విశ్వక్ లైలా చిత్రానికి సెన్సార్ బోర్డు ఏ 'ఎ' సర్టిఫికేట్‌ ఇచ్చినట్లు హీరో విశ్వక్ తెలిపారు. తమ సినిమాకు 'A' సెర్టిఫికెట్ ఎందుకు వచ్చిందో విడుదలయ్యాక ప్రేక్షకులకు తెలుస్తుందని అన్నారు. యూత్ ని అలరించే విధంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలిపారు.

New Update
laila movie a certificate

laila movie a certificate

Vishwaksen: మాస్ కాదాస్ విశ్వక్ సేన్ నటించిన లేటెస్ట్  రొమాంటిక్ డ్రామా  'లైలా'. వాలెంటైన్స్ డే సందర్భంగా  ఫిబ్రవరి 14  ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు . ఇందులో విశ్వక్ లేడీ గెటప్ లో కనిపించడం మరింత క్యూరియాసిటీని పెంచుతోంది. రామ్ నారాయణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్స్ బ్యానర్ పై సాహు గారపాటి  నిర్మించారు. 

'ఎ' సర్టిఫికేట్‌

అయితే మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఇటీవలే  ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న విశ్వక్ సినిమాకు సంబంధించి ఆసక్తికర విషయాలు పంచుకున్నారు.  'లైలా'  చిత్రానికి సెన్సార్‌ బోర్డు 'ఎ' సర్టిఫికేట్‌ ఇచ్చినట్లు హీరో విశ్వక్ తెలిపారు. తమ సినిమాకు  'A' సెర్టిఫికెట్ ఎందుకు వచ్చిందో విడుదలయ్యాక ప్రేక్షకులకు తెలుస్తుందని అన్నారు. యూత్ ని అలరించే విధంగా ఈ సినిమా ఉండబోతున్నట్లు తెలిపారు.  ఇది ఇలా ఉంటే ఇప్పటికే  'లైలా'  నుంచి విడుదలైన ట్రైలర్, పాటలు సినిమాకు సూపర్ బజ్ క్రియేట్ చేశాయి. ముఖ్యంగా ' ఓహో రత్తమ్మా' సాంగ్  సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతోంది. ఈ పాట మధ్యలో రీసెంట్ గా వైరలైన 'కోయ్ కోయ్ కోడ్ని కోయ్' అనే లిరిక్ ని యాడ్ చేయడం  మరింత హైలైట్ అయ్యింది.  లియో జేమ్స్ ఈ చిత్రానికి  సంగీతం అందించారు. 

చీఫ్ గెస్టుగా మెగాస్టార్ .. 

'లైలా'  ప్రీ రిలీజ్ వేడుకకు మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ తాజాగా సోషల్ మీడియా వేదికగా ట్వీట్ చేశారు మేకర్స్. హీరో విశ్వక్ సేన్, నిర్మాత సాహూ గారపాటి మెగాస్టార్ ని స్వయంగా కలిసి ప్రీ రిలీజ్ వేడుకకు ఆహ్వానించారు. ఇందుకు సంబంధించిన ఫొటోలను కూడా పంచుకున్నారు. ఈ చిత్రంలో విశ్వక్ జోడీగా యంగ్ బ్యూటీ ఆకాంక్ష శర్మ ఫీమేల్ లీడ్ గా నటించింది. 

Also Read: Saif Ali khan Attack: సైఫ్ ను పొడిచింది వాడే.. పోలీసుల ముందే గుర్తు పట్టిన పని మనుషులు!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు