తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యలతో సంధ్య థియేటర్ ఘటన మరోసారి హాట్ టాపిక్ అయింది. ఆయన అల్లు అర్జున్ పై తీవ్ర ఆరోపణలు చేయడం, దానికి కౌంటర్ గా అల్లు అర్జున్ ప్రెస్ మీట్ పెట్టడం, అందులో తనపై చేసినవన్నీ తప్పుడు ఆరోపణలు అని చెప్పడంతో తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు అందరూ ఈ ఇష్యూ గురించే చర్చించుకుంటున్నారు.
ఐ బొమ్మలో HD ప్రింట్..
ఈ ఘటనలో అల్లు అర్జున్ పైనే బాగా నెగిటివిటీ వస్తోంది. ఇలాంటి తరుణంలో బన్నీకి ఇప్పుడు మరో షాక్ తగిలింది. ఆయన నటించిన 'పుష్ప2' మూవీ ఏకంగా HD ప్రింట్ తో ఆన్ లైన్ లో ప్రత్యక్ష మయింది. i bomma, movierulz లాంటి సైట్స్ లో 'పుష్ప2' HD ప్రింట్ అప్లోడ్ చేశారు.
ఇది కూడా చదవండి: అబద్ధాలు చెప్పకు పుష్ప.. ఇదిగో ప్రూఫ్.. కాంగ్రెస్ నేత సంచలన వీడియో
నిన్నటి నుంచి పలు సైట్లలో 'పుష్ప2' HD వెర్షన్ ప్లే అవుతోంది. అందులో ఆన్ లైన్ వాచింగ్ తో పాటూ HD ప్రింట్ ను డౌన్ లోడ్ చేసుకునే వెసులుబాటు కూడా ఉంది. ఇది కాస్త మూవీ టీమ్ కు పెద్ద ఎదురుదెబ్బ అని చెప్పొచ్చు.
ఎందుకంటే ఆన్ లైన్ లోనే 'పుష్ప2' HD ప్రింట్ ఉండడంతో ఇక థియేటర్స్ కి వెళ్లి జనాలు సినిమాను చూసే ఛాన్స్ లేదు. అందరూ ఎంచక్కా తమ ఫోన్ లోనే చూసుకుంటారు. అదికాస్త 'పుష్ప2' కలెక్షన్స్ పై ప్రభావం పడుతుంది. మరి ఈ విషయంలో చిత్ర యూనిట్ ఎలాంటి యాక్షన్ తీసుకుంటారో చూడాలి.