PUSHPA 2: ‘పుష్ప 2’ మరో రికార్డు.. అక్కడ నంబర్ వన్ చిత్రంగా..!

అల్లు అర్జున్ నటించిన పుష్ప 2 చిత్రం మరో రికార్డును తన ఖాతాలో వేసుకుంది. రూ.806 కోట్లు (నెట్‌) వసూలు చేసి హిందీ బాక్సాఫీస్‌ వద్ద నంబర్ వన్ చిత్రంగా నిలిచింది. ఈ విషయాన్ని తెలియజేస్తూ చిత్ర నిర్మాణ సంస్థ స్పెషల్‌ ప్రోమో విడుదల చేసింది.

New Update
PUSHPA 2 RECORDS

PUSHPA 2 RECORDS

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘పుష్ప 2’ మూవీ నేషనల్ వైడ్‌గానే కాకుండా వరల్డ్ వైడ్‌గా దుమ్ము దులిపేసింది. డిసెంబర్ 5న రిలీజ్ అయిన ఈ చిత్రం బాక్సాఫీసును బద్దలు కొట్టింది. బడా హీరోల సినిమాల రికార్డులను వెనక్కి నెట్టి.. కొత్త రికార్డులను సృష్టించింది. 

Also Read : బండి సంజయ్ నా బ్రదర్.. RTV ఇంటర్వ్యూలో పొన్నం సంచలన సీక్రెట్స్

రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు

రూ.1000 కోట్ల కలెక్షన్స్ రాబట్టాలని బరిలోకి దిగిన పుష్ప2 ఆ రికార్డును కేవలం 9 రోజుల్లోనే సాధించి అందరినీ ఆశ్చర్యపరచింది. ఇప్పటికి ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా రాబట్టింది. ఇప్పుడు రూ.2000 కోట్ల దిశగా పరుగులు పెడుతోంది. ఇలా భారీ కలెక్షన్లతో బాహుబలి, ఆర్ఆర్ఆర్, కేజీఎఫ్ వంటి పెద్ద పెద్ద సినిమాల రికార్డులను తుంగలోకి తొక్కింది. 

దర్శకుడు సుకుమార్ స్క్రీన్ ప్లేకి సినీ ప్రియులు నీరాజనాలు పలికారు. అతడి క్రియేటివిటీకి మంత్రముగ్దులయ్యారు. సినిమాలో అల్లు అర్జున్ యాక్టింగ్‌ను పరవశించిపోయారు. ముఖ్యంగా సినిమాకి జాతర ఎపిసోడ్ హైలైట్‌గా నిలిచి అదరగొట్టేసింది. అంతేకాకుండా సినిమాలోని బన్ని డైలాగ్స్, థ్రిల్లింగ్ ఎలిమెంట్స్, సాంగ్స్, డ్యాన్స్, రష్మిక యాక్టింగ్, ఫహాద్ ఫాజిల్ నటన ఓ రేంజ్‌లో ఉందనే చెప్పాలి. 

Also Read : పదో తరగతి విద్యార్థులకు అలర్ట్.. పరీక్షల్లో మార్పులు

పుష్ప 2 మరో రికార్డు

ఇలా అన్ని ఎలిమెంట్స్‌లోనూ దర్శకుడు సుకుమార్ సక్సెస్ అయ్యాడు. అందువల్లనే ఈ సినిమా వరల్డ్ వైడ్‌గా రికార్డులు క్రియేట్ చేసింది. ఇప్పుడు పుష్ప2 మరో కొత్త రికార్డును తన ఖాతాలో వేసుకుంది. దాదాపు రూ.806 కోట్లు (నెట్‌) వసూలు రాబట్టి హిందీ బాక్సాఫీస్‌ వద్ద నంబర్ వన్ చిత్రంగా పుష్ప2 నిలిచింది. ఈ విషయాన్ని మేకర్స్ తెలియజేశారు. ఈ మేరకు సోషల్ మీడియా ద్వారా ఓ పోస్టర్‌ను పంచుకున్నారు. 

Also Read : సినిమా ఇండస్ట్రీకి పవన్ కీలక సూచన.. సంచలన లేఖ విడుదల!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు