/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
Priya Marathe: మరాఠీ, హిందీ సీరియల్స్ తో పేరు పొందిన ప్రముఖ నటి టెలివిజన్ ప్రజెంటర్ ప్రియా మరాఠే కన్నుమూశారు. గత కొంతకాలంగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమె ఈరోజు ముంబైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. 38 ఏళ్లకే ప్రియా మృతి చెందడం ఆమె అభిమానులను, సన్నిహితులను తీవ్ర దిగ్బ్రాంతికి గురి చేసింది. ప్రియా మృతి పట్ల సినీ తారలు, అభిమానులు సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలియజేస్తున్నారు. 'కసంహ్ సే,' 'పవిత్ర రిష్తా,' 'బడే అచ్చే లగ్తే హై' తన నటనకు మంచి గుర్తింపు తెచ్చుకుంది ప్రియా.
Television and film actor Priya Marathe, best known for her role in the hit serial ‘Pavitra Rishta’, passed away in Mumbai on August 31, 2025. She was 38 years old. https://t.co/6lfNZxUUZV
— The Statesman (@TheStatesmanLtd) August 31, 2025
క్యాన్సర్ తో పోరాటం
ప్రియా మరాఠే గత కొన్ని సంవత్సరాలుగా క్యాన్సర్ తో పోరాడుతున్నారు. అయితే మొదట్లో ఆమె చికిత్సకు బాగా స్పందించినప్పటికీ.. ఆ తర్వాత సడెన్ గా మళ్ళీ తిరగబడింది. చివరకు శరీరం చికిత్సకు సహకరించకపోడంతో అకాలంగా మరణించింది ప్రియా.
యాక్టింగ్ కెరీర్
1987 ఏప్రిల్ 23న ముంబైలో పుట్టి పెరిగిన ప్రియా.. అక్కడే చదువు పూర్తి చేశారు. ఆ తర్వాత యాక్టింగ్ కెరీర్ వైపు అడుగులు వేశారు. మొదట టెలివిజన్ ప్రజెంటర్, సీరియల్స్ తో తన సినీ కెరీర్ ని ప్రారంభించింది.
యా సుఖనోయ', 'చార్ దివాస్ సాసుచే' బుల్లితెర ప్రేక్షకులకు పరిచయమైంది.
2006 లో 'ఏక్తా కపూర్' నిర్మించిన 'కసమ్ సే' సీరియల్ లో 'విద్యా బాలి' పాత్రతో ప్రియకు మంచి గుర్తింపు వచ్చింది. ఇది ఆమె కెరీర్ కి బ్రేక్ ఇచ్చిన సీరియల్ గా నిలిచింది. ఆ తర్వాత 'పవిత్ర రిష్ట' సీరియల్ లో వర్ష సతీష్ పాత్ర ఆమెకు దేశవ్యాప్తంగా అభిమానులను తెచ్చిపెట్టింది. 'బడే అచ్చే లగ్తే హై', 'తూ టిథే మె', 'భాగే రే మన్', 'జయస్తుతే', 'భారత్ కా వీర్ పుత్ర - మహారాణా ప్రతాప్' వంటి పలు సీరియల్స్ లో నటించింది.