Allu Arjun: వైఎస్ జగన్ కి థ్యాంక్స్ చెప్పిన అల్లు అర్జున్.. వైరలవుతున్న ట్వీట్!

అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి సంతాప ప్రకటనపై అల్లు అర్జున్ స్పందించారు. వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు. థ్యాంక్యూ జగన్‌ గారు! మీ మంచి మాటలు, సపోర్ట్ కి మేము నిజంగా కృతజ్ఞులం అని బదీలిచ్చారు.

New Update
allu arjun - jagan

allu arjun - jagan

Allu Arjun: దివంగత సీనియర్ నటులు అల్లు రామలింగయ్య సతీమణి, నిర్మాత అల్లు అరవింద్ తల్లి, అల్లు అర్జున్ నానమ్మ అల్లు కనకరత్నమ్మ  మృతి పట్ల వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి  సంతాప ప్రకటనపై  అల్లు అర్జున్ స్పందించారు.  వైఎస్ జగన్ కు కృతజ్ఞతలు తెలియజేస్తూ ట్వీట్ చేశారు.థ్యాంక్యూ జగన్‌ గారు! మీ మంచి మాటలు, సపోర్ట్ కి మేము నిజంగా కృతజ్ఞులం అని బదీలిచ్చారు. 

జగన్ ట్వీట్ 

కొన్ని రోజులుగా వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న అల్లు కనకరత్నమ్మ శనివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో తుది శ్వాస విడిచారు. ఈ విషయం తెలుసుకున్న వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డి అల్లు కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. అల్లు కనకరత్నమ్మ మృతి పట్ల సంతాపం తెలియజేస్తూ ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు.  ''దివంగ‌త న‌టులు అల్లు రామ‌లింగ‌య్య  స‌తీమ‌ణి, ప్ర‌ముఖ నిర్మాత అల్లు అర‌వింద్  త‌ల్లి క‌న‌క‌ర‌త్న‌మ్మ  మృతి చెందడం ఎంతో  బాధాకరం. ఆమె ఆత్మ‌కు శాంతి చేకూరాల‌ని ఆ భగవంతుడిని  ప్రార్థిస్తున్నాను.  వారి కుటుంబ స‌భ్యుల‌కు నా ప్రగాఢ సానుభూతి'' అని ట్వీట్ చేశారు.  

అల్లు అర్జున్ - అట్లీ 

ఇదిలా ఉంటే పుష్ప ఫ్రాంచైజీతో పాన్ ఇండియా హిట్ కొట్టిన అల్లు అర్జున్ .. నెక్స్ట్ అట్లీ డైరెక్షన్ లో ఓ స్పై యాక్షన్ ఎంటర్ టైనర్ చేస్తున్నారు. #AAA6  వర్కింగ్ టైటిల్ తో ఈ చిత్రం రూపొందుతోంది. ఈ సినిమాకు సంబంధించి ఇప్పటికే ఒక చిన్న కాన్సెప్ట్ వీడియో రిలీజ్ చేయగా .. సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇందులో అల్లు అర్జున్ 3 భిన్నమైన షెడ్స్ లో కనిపించబోతున్నారని టాక్. బన్నీ  మేకోవర్ కూడా మునుపెన్నడు చూడని విధంగా డిఫరెంట్ గా ఉంటుందని సమాచారం.

సన్ పిక్చర్స్ నిర్మాణంలో

భారీ బడ్జెట్ తో పాన్ ఇండియా స్థాయిలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని సన్ పిక్చర్స్ నిర్మిస్తోంది. నటి దీపికా పదుకొనె ఇందులో ఫీమేల్ లీడ్ గా నటిస్తున్నారు. జవాన్ లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత అట్లీ నుంచి రాబోతున్న ఈ సినిమా పై అంచనాలు భారీగా ఉన్నాయి. 

Advertisment
తాజా కథనాలు