అల్లు అర్జున్ 'పుష్ప2' టాలీవుడ్ కొంప ముంచింది. ఈ సినిమా ప్రీమియర్ లో భాగంగా జరిగిన తొక్కిసలాటలో మహిళ చనిపోవడం, ఆమె కొడుకు చావు బ్రతుకుల్లో హాస్పిటల్ లో ఉండటం, ఈ ఘటనలో అల్లు అర్జున్ అరెస్ట్ అవ్వడం, ఒకరోజు జైల్లో ఉండటం.. ఇలా గతంలో ఎన్నడూ లేని విధంగా ఇండస్ట్రీలో ఒకదాని తర్వాత ఒకటి జరిగిపోయాయి. ఈ వివాదానికి మరింత ఆజ్యం పోస్తూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి అసెంబ్లీలో అల్లు అర్జున్ తో పాటూ ఆయన్ని పరామర్శించిన సినీ ప్రముఖులందరిపై ఫైర్ అయ్యాడు. అంతటితో ఆగకుండా ఇక నుంచి సినిమాలకు సంబంధించి బెని ఫిట్ షోలకు, టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతులు ఇవ్వమని ప్రకటించారు. ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ అతి.. ఇదే తగ్గించుకుంటే మంచిది..' సోషల్ మీడియాలో రేవంత్ ఫ్యాన్స్ హల్చల్ దిల్ రాజుకు ఎదురు దెబ్బ.. రేవంత్ రెడ్డి ఫైర్ అయింది అల్లు అర్జున్ పై అయితే మంటలు అంటుకుంది మాత్రం నిర్మాత దిల్ రాజుకి.. ఎందుకంటే ఆయన నుంచి త్వరలోనే మూడు సినిమాలు థియేటర్స్ లో రిలీజ్ కాబోతున్నాయి. అందులో ఓ పాన్ ఇండియా సినిమా కూడా ఉంది. ఇలాంటి టైం లో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటన దిల్ రాజు సినిమాలకు ఊహించని ఎదురుదెబ్బగా మారనుంది. దిల్ రాజు కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో తెరకెక్కిన మూవీ 'గేమ్ ఛేంజర్' జనవరి 10 న రిలీజ్ కాబోతుంది. రామ్ చరణ్ - శంకర్ కాంబోలో తెరకెక్కిన ఈ సినిమా కోసం రూ.250 కోట్లు పెట్టినట్లు తెలుస్తోంది. అంటే థియేట్రికల్ గా కనీసం 500 కోట్లకు పైగా బిజినెస్ చేయడం గ్యారెంటీ. అలా జరిగితే నష్టాలే.. అంత భారీ మొత్తంలో రాబట్టాలంటే ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో కష్టమే. ఈ ఒక్క సినిమానే కాదు వెంకటేష్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమా నిర్మాత కూడా ఆయనే. అలాగే బాలయ్య 'డాకు మహారాజ్' ను నైజాంలో దిల్ రాజే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నారు. ఇది కూడా చదవండి: అల్లు అర్జున్ అతి.. ఇదే తగ్గించుకుంటే మంచిది..' సోషల్ మీడియాలో రేవంత్ ఫ్యాన్స్ హల్చల్ ఈ మూడు సినిమాలతో భారీ లాభాలు పొందాలనుకుంటున్న దిల్ రాజు ఆశలపై అల్లు అర్జున్ నీళ్లు చల్లినట్లయింది. రేవంత్ రెడ్డి చెప్పినట్లు బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు పెంచుకునేందుకు పర్మిషన్ ఇవ్వకపోతే దిల్ రాజుకి భారీ నష్టాలు తప్పవు.