Cinema: సుకుమార్ మా జీవితాలకు అర్థం తీసుకొచ్చారు..అల్లు అర్జున్

పుష్ప 2 దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఓటీటీలో కూడ ప్రభంజన క్రియేట్ చేస్తోంది. ఈ సందర్భంగా పుష్ప 2 థాంక్స్ మీట్ జరిగింది. ఇందులో అల్లు అర్జున్ మాట్లాడుతూ..క్రెడిట్ అంతా దర్శకుడు సుకుమార్ కే దక్కుతుందని చెప్పారు. 

New Update
hyd

Pushpa-2 Thanks Meet

సుకుమార్ లేకపోతే పుష్ప 2 సినిమానే లేదని అన్నారు మెగా హీరో అల్లు అర్జున్. ఆయన తమ జీవితాలకు ఓ అర్ధాన్ని తీసుకువచ్చారని ఎమోషనల్ అయ్యారు. టీనటులు ఎంత కష్టపడినా దర్శకుడు సరిగా చేయకపోతే, అది హిట్ కాదు. అలాగే నటీనటులు సరిగా చేయకపోయినా దర్శకత్వం బాగుంటే, ఆ సినిమా కచ్చితంగా ఆడుతుంది. కాబట్టి మొత్తం థాంక్స్ సుకుమార్ కే చెప్పాలని బన్నీ అన్నారు. తాను బాగా నటించానంటే దానికి కారణం సుకుమారే అన్నారు. సరైన మార్గనిర్దేశం లేకుండా ఏ నటుడు మంచి నటుడు కాలేడు. అతడు ఎంత గొప్ప స్టార్‌ అయినా కూడా. నన్ను గైడ్‌ చేసినందుకు థ్యాంక్స్‌ అని అల్లు అర్జున్ చెప్పారు. 

తాను గొప్ప నటుడు అవ్వడానికి సుకుమారే కారణం..

అల్లుఅర్జున్, రష్మిక, ఫాహద్ ఫాజిల్ కీలక పాత్రల్లో నటించిన పుష్ప 2 దేశ వ్యాప్తంగా రికార్డ్ వసూళ్ళు రాబట్టింది.  ప్రపంచవ్యాప్తంగా రూ.1800 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. తాజాగా నెట్‌ఫ్లిక్స్‌ ఓటీటీలోనూ అదరగొడుతోంది. ఈ సందర్భంగా మూవీ టీమ్ థ్యాంక్స్ మీట్ నిర్వహించింది. సినిమా కోసం పి చేసిన వారందరికీ షీల్డులు అందించింది.

పుష్ప 3 అద్భుతంగా ఉంటుంది.. 

మైత్రీ మూవీ మేకర్స్ లేకుండా పుష్ప లాంటి తీయడం అసాధ్యమన్నారు బన్నీ. అలాగే మ్యూజిక్ డైరెక్టర్ డీఎస్పీ, కొరియోగ్రాఫర్లు, స్టంట్ మాస్టర్లు అందరూ సినిమాకు ఎంతో బలాన్ని ఇచ్చారని కొనియాడారు. అలాగే ఫహద్‌ ఫాజిల్‌ ఈ సినిమాకు ఎంతో బలాన్నిచ్చారు. ‘పుష్ప2’ వస్తోందని, హిందీ సినిమా విడుదల తేదీని కూడా మార్చుకుంది. ప్రతి ఇండస్ట్రీ చూపిస్తున్న ప్రేమకు ధన్యవాదాలు అని చెప్పుకొచ్చారు అల్లు అర్జున్. ఈ విజయాన్ని తన అభిమానులకు అంకితం ఇస్తున్నానని చెప్పారు. నా ఆర్మీని ఎప్పుడూ ప్రేమిస్తూ ఉంటానని అన్నారు.  మిమ్మల్ని మరింత గర్వపడేలా చేస్తా. ‘పుష్ప3’.. అదేంటో నాకు, సుకుమార్ కు కూడా తెలియదు. కానీ, అదొక అద్భుతమైన ఎనర్జీలా ఉంది. అదెప్పుడు కార్యరూపం దాలుస్తుందో చూడాలి అని అన్నారు.

Also Read: AP: ప్రముఖ పాశ్రామిక వేత్త జనార్దనరావు దారుణ హత్య...

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు