AP: ప్రముఖ పాశ్రామిక వేత్త జనార్దనరావు దారుణ హత్య...

వెల్జాన్ గ్రూపు సంస్థల అధినేత, ప్రముఖ పారిశ్రామిక వేత్త వెలమాటి జనార్ధన్ రావు దారుణ హత్యకు గురయ్యారు. తన మనుమడి చేతిలోనే ఆయన ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఆస్తి తగాదాల కారణంగా మనుమడు తాతను 73 సార్లు కత్తిపొడిచి చంపాడు. 

New Update
AP

Industrialist Velamati Janardhan Rao

ఆస్తి తగాదాలు ఎంతటి వారి ప్రాణాలకైనా ముప్పే. తాజాగా ఇదే కారణంతో ప్రముఖ పారిశ్రామిక వేత్త  వెలమాటి జనార్ధన్ రావు ఇదే ఆస్తి గాదాల నేపథ్యంలో తన మనుమడి చేతిలోనే దారుణ హత్యకు గురైయ్యారు. రెండో కూతురు కొడుకైన  కిలారు కీర్తితేజ తన తాతను ఏకంగా 73 సార్లు కత్తితో పొడిచి చంపాడు. హైదరాబాద్‌ నగరంలోని సోమాజిగూడలో ఈ ఘటన చోటుచేసుకోగా నిందితుడిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. 

అసలేం జరిగిందంటే...

ఏపీలోని ఏలూరు ప్రాంతానికి చెందిన జనార్దన్‌రావు కొన్నేళ్లుగా హైదరాబాద్ లోని సోమాజిగూడలో ఉంటున్నారు. రీసెంట్ గా  తన పెద్ద కుమార్తె కుమారుడైన శ్రీకృష్ణను వెల్జాన్‌ కంపెనీకి డైరెక్టరుగా నియమించారు. అదే సమయంలో మరో కుమార్తె సరోజినీదేవి కుమారుడైన కిలారు కీర్తితేజ పేరిట రూ.4 కోట్ల షేర్లను బదిలీ చేశారు. అయితే రెండో కూతురు, అతని కొడుకు దీంతో సాటిస్ఫై అవలేదు. కొన్ని రోజులుగా ఆస్తుల కోసం గొడవలు పడుతున్నారు.  ఇందులో భాగంగానే గురువారం రాత్రి సరోజినీదేవి తన కుమారుడైన కీర్తితేజతో కలిసి తండ్రి జనార్ధన్ రావు ఇంటికి వచ్చారు. ఆ సమయంలో ఆస్తి పంపకాల విషయంలో తాతతో కీర్తితేజ వాగ్వాదానికి దిగాడు. తన తల్లిని టీ తెమ్మని చెప్పి వంటింట్లోకి పంపించి తన వెంట తెచ్చుకున్న కత్తితో తాత జనార్ధన్ రావును 73 సార్లు పొడిచేశాడు కీర్తి తేజ. తండ్రి కేలు విన్న కూతురు సరోజినీ దేవి కొడుకుని ఆపబోయింది. అయితే అతను తన తల్లి మీద కూడా అటాక్ చేశారు. ఆమెను నాలుగు చోట్ల కత్తితో పొడిచాడు. అక్కడే ఉన్న కాపలాదారు వీరబాబు వచ్చేందుకు ప్రయత్నించగా దగ్గరకు రావొద్దని హెచ్చరించాడు. తర్వాత అక్కడి నుంచి కీర్తితేజ పరారయ్యాడు.

సమాచారం అందుకున్న పోలీసులు...వెంటనే కేసు నమోదు చేసుకుని కీర్తితేజను వెతికి పట్టుకున్నారు. అతన్ని పంజాగుట్టలో అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.  మరోవైు కత్తిపోట్లకు గురై సరోజినీ దేవి జూబ్లీహిల్స్‌లోని ఓ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. పోలీసులు కీర్తితేజ మాదకద్రవ్యాలకు బానిసనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. అయితే జనార్ధన్ రావు ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి రూ.40 కోట్లు, తిరుమల తిరుపతి దేవస్థానానికి రూ.40 కోట్ల విరాళాలు ఇచ్చారు. 

Also Read: Delhi Elections: ఓటమి...గెలుపు...రెండిటికీ ఆయనే కారణం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు