Allu Arjun-Atlee: అల్లు అర్జున్ హీరోయిన్ గా గ్లోబల్ బ్యూటీ.. అట్లీ సినిమాపై అదిరే అప్డేట్

అట్లీ దర్శకత్వంలో తెరకెక్కనున్న అల్లు అర్జున్ నెక్స్ట్ ఫిల్మ్ లో గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రా ఫీమేల్ లీడ్ గా నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించి డైరెక్టర్, హీరోయిన్ మధ్య చర్చలు కూడా జరుగుతున్నట్లు సమాచారం.

New Update
allu arjun- Atlee movie Priyanka chopra as female lead

allu arjun- Atlee movie Priyanka chopra as female lead

Allu Arjun-Atlee: అల్లు అర్జున్- అట్లీ కాంబోలో రాబోతున్న #A6 కోసం సన్నాహాలు జరుగుతున్నాయి. ఏప్రిల్ 6న బన్నీ బర్త్ డే సందర్భంగా ఈ సినిమా అధికారిక చేయనున్నట్లు సమాచారం. ఈ క్రమంలో దీనికి సంబంధించిన మరో ఇంట్రెస్టింగ్ అప్డేట్ నెట్టింట వైరల్ అవుతోంది. పలు నివేదికల ప్రకారం.. ఇందులో ఫీమేల్ లీడ్ గా గ్లోబల్ బ్యూటీ ప్రియాంక చోప్రాను ఎంపిక చేసుకునే ఆలోచనలో ఉన్నారట డైరెక్టర్ అట్లీ. ప్రస్తుతం దీనికి సంబంధించి ఇద్దరి మధ్య చర్చలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. అంతా సవ్యంగా జరిగితే అట్లీ సినిమాలో అల్లు అర్జున్ సరసన ప్రియాంక చోప్రా నటిస్తుంది.

ఇది కూడా చూడండి: Actor Darshan Arrest: జడ్జి కుమారుడిపై దాడి.. నటుడు & బిగ్ బాస్ ఫేం కంటెస్టెంట్‌ అరెస్టు

ఇది కూడా చూడండి: Bengaluru : పాపం.. అలోవెరా జ్యూస్ అనుకొని పురుగుల మందు తాగింది!

అయితే అట్లీ 'జవాన్' సినిమా మాదిరిగానే అల్లు అర్జున్ కూడా ఇందులో ద్విపాత్రాభినయం చేయనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అద్భుతమైన విజువల్స్, పవర్ ఫుల్ యాక్షన్, అట్లీ స్పెషల్ టచ్ ఈమూవీలో ఉండబోతున్నాయి. దీంతోపాటు త్రివిక్రమ్ శ్రీనివాస్ తో మరో పౌరాణిక చిత్రాన్ని లైన్లో పెట్టారు అల్లు అర్జున్. ఇందులో బన్నీ లార్డ్ కార్తికేయ పాత్రలో కనిపిస్తారని సినీ వర్గాల్లో టాక్. ఇదిలా ఉంటే.. ప్రియాంక చోప్రా ప్రస్తుతం రాజమౌళి ssmb29 లో బిజీగా ఉంది. సౌత్ సూపర్ స్టార్ మహేష్ బాబు  హీరోగా భారీ బడ్జెట్ తో ఈ సినిమా రూపొందుతోంది. రీసెంట్ గా ఈ మూవీ షూటింగ్ కోసం ప్రియాంక అమెరికా నుంచి హైదరాబాద్ వచ్చింది. 

telugu-news | cinema-news | latest-news | allu-arjun-atlee-movie | priyanka-chopra

ఇది కూడా చూడండి: TG Crime : ఏం మనిషివిరా నువ్వు..ఆరోగ్యం బాలేక.. స్నేహితుడిని నమ్మి కూతుర్ని అప్పగిస్తే!

Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Venkatesh - Trivikram: ఆ స్టార్ హీరోతో త్రివిక్రమ్ భారీ మల్టీస్టారర్..?

త్రివిక్రమ్ తన నెక్ట్స్ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను వెంకటేష్‌తో చేయబోతుండగా, ఆ మూవీలో సెకండ్ హీరోగా రామ్ చరణ్‌ను తీసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. త్వరలో చరణ్-త్రివిక్రమ్ మధ్య కీలక మీటింగ్ జరగనుంది. చరణ్ ప్రస్తుతం "పెద్ది" షూటింగ్‌లో బిజీగా ఉన్నారు.

New Update
Venkatesh - Trivikram

Venkatesh - Trivikram

Venkatesh - Trivikram: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం అట్లీ దర్శకత్వంలో తన నెక్స్ట్  ప్రాజెక్ట్‌ కమిట్ కావడంతో, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తన తర్వాతి సినిమాను బన్నీ తో చేయాల్సింది, వేరే ఆప్షన్ లేక విక్టరీ వెంకటేష్‌తో చేయబోతున్నట్టు తేలిపోయింది. ఈ ఫ్యామిలీ ఎంటర్టైనర్ మూవీ జూలైలో సెట్స్ పైకి వెళ్లనుంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికరమైన సమాచారం ఒకటి వెలుగులోకి వచ్చింది.

చరణ్, త్రివిక్రమ్ మధ్య కీలక మీటింగ్

ఈ సినిమా మల్టీస్టారర్ కానుందని, రెండో హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ కోసం త్రివిక్రమ్ ప్రయత్నాలు చేస్తున్నారు. త్రివిక్రమ్, రామ్ చరణ్ కలిసి సినిమా చేయాలన్న ఆలోచన ఎప్పటి నుంచో ఉన్నప్పటికీ, ఇప్పటి వరకూ అనేక కారణాల వల్ల అది కుదరలేదు. ఇక ఈసారి మాత్రం ఇద్దరూ సీరియస్‌గా ఈ ప్రాజెక్ట్‌ పై దృష్టిపెట్టారని సమాచారం. వచ్చే వారం చరణ్, త్రివిక్రమ్ మధ్య కీలకమైన మీటింగ్ జరగనుంది.

ఇక రామ్ చరణ్ ప్రస్తుతం "పెద్ది"తో పాన్ ఇండియా స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నారు. ఈ సినిమాలో రగ్గ్డ్ లుక్‌లో కనిపించనుండటంతో, త్రివిక్రమ్ రూపొందించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్‌కు చరణ్ కొత్తగా మేకోవర్ కావాల్సి రావొచ్చు. కథ నచ్చితే చరణ్ ఈ ప్రాజెక్ట్‌కి డేట్స్ కేటాయించాల్సి ఉంటుంది.

త్రివిక్రమ్ ఈ చిత్రాన్ని షార్ట్ షెడ్యూల్స్‌లో పూర్తి చేసి 2026 సంక్రాంతికి విడుదల చేయాలనే లక్ష్యంతో ఉన్నారు. అయితే, ఇదే టైంలో మెగాస్టార్ చిరంజీవి - అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో ఓ భారీ సినిమా రిలీజ్‌కి సిద్ధమవుతోంది. రామ్ చరణ్ ఈ ప్రాజెక్ట్‌లో జాయిన్ అయితే, ఈ సినిమా వేసవికి వాయిదా పడే అవకాశం ఉంది.

మరోవైపు చరణ్ సై అంటే, ఈ పవర్‌ఫుల్ మల్టీస్టారర్‌ కోసం త్రివిక్రమ్ వేరే హీరో కోసం వెతకాల్సిన అవసరం ఉండదు. లేదంటే ఇంకొక స్టార్ హీరో కోసం త్రివిక్రమ్ వెంటనే సెర్చ్ ప్రారంభించాల్సి ఉంటుంది.

ఈ భారీ ఫ్యామిలీ ఎంటర్టైనర్‌ను హారిక అండ్ హాసిని క్రియేషన్స్ నిర్మించనుంది. ఇప్పటికే త్రివిక్రమ్ స్క్రిప్ట్‌ వర్క్ పూర్తి చేయగా, ప్రీ ప్రొడక్షన్ ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. త్వ‌ర‌లో అధికారిక ప్ర‌క‌ట‌న రావ‌చ్చు.

Advertisment
Advertisment
Advertisment