Allu Arjun: ఇది మతిలేని చర్య.. అల్లు అర్జున్ కేసుపై న్యాయమూర్తి సీరియస్

అల్లు అర్జున్ పై నంద్యాల పోలీసులు నమోదు చేసిన కేసును కొట్టివేస్తున్నట్లు హైకోర్టు తీర్పునిచ్చింది. న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే.కృపాసాగర్‌ ఈ కేసును కొట్టి వేశారు. ఇలాంటి ఘటనలో కేసు నమోదు చేయడం మతిలేని చర్య అవుతుందని న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నాడు.

New Update
sdcsc

టాలీవుడ్ అగ్ర హీరో అల్లు అర్జున్ ఎన్నికల ప్రవర్తన నియమావళిని ఉల్లంఘించారంటూ పోలిసులు ఇటీవల ఆయనపై కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసు హైకోర్టులో విచారణకు రాగా.. న్యాయమూర్తి జస్టిస్‌ వీఆర్‌కే.కృపాసాగర్‌ బుధవారం ఈ కేసును కొట్టి వేశారు. 

Also Read :  మధుమేహ రోగులు పాలు తాగొచ్చా.? లేదా.?

అల్లు అర్జున్ తన స్నేహితుడు, వైసీపీ అభ్యర్థి శిల్పా రవి కోసం ప్రచారం చేసిన క్రమంలో.. 144 సెక్షన్ అమల్లో ఉండగా జనసమీకరణ చేశారంటూ బన్నీ పై నంద్యాల పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై అల్లు అర్జున్ స్పందిస్తూ తనపై నమోదైన కేసును కొట్టివేయాలని ఏపీ హైకోర్టులో పిటీషన్ దాఖలు చేశారు.  బన్నీ పిటీషన్ స్వీకరించి గత నెల 25న విచారణ జరిపిన ధర్మాసనం.. నవంబర్ 6కు తుది తీర్పును వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.

Also Read : హైదరాబాద్ లో జాన్వీ కపూర్ ప్రత్యేక పూజలు.. వైరలవుతున్న ఫొటోలు

 నిన్న ఫైనల్ హియరింగ్ జరగగా.. బన్నీ పై  నంద్యాల పోలీసులు నమోదు చేసిన కొట్టివేస్తున్నట్లు హైకోర్టు తీర్పునిచ్చింది. ఈ కేసుపై వాదనలు ముగించిన న్యాయమూర్తి బుధవారం తీర్పు వెల్లడించారు.' స్నేహితుడైన కిశోర్‌రెడ్డి ఇంటికి అల్లు అర్జున్‌ వెళ్లారు. అభిమానులను ఆహ్వానించినట్లు ఆధారాలేవు. ఒకచోట చేరిన అభిమానులను చెదరగొట్టాల్సిన బాధ్యత అధికార యంత్రాగానిదే. 

Also Read :  మెరాకిల్.. తెగిన చేతిన అతికించిన వైద్యులు, రాష్ట్రంలో ఇదే తొలిసారి!

మతిలేని చర్య..

ఆ పని చేయకుండా డిప్యూటీ తహసీల్దారు తప్పుడు మార్గంలో క్రిమినల్‌ చర్యలకు ఉపక్రమించారు. కోడ్‌ ఉల్లంఘించినట్లు భావిస్తే ఉన్నతాధికారి దృష్టికి తీసుకెళ్లి ఉండాల్సింది. అయినా.. అభిమానులు ఒక చోట చేరడం వల్ల ఎవరికి ఇబ్బంది కలిగినట్లు కనిపించడం లేదు. ఇలాంటి ఘటనలో కేసు నమోదు చేయడం మతిలేని చర్య అవుతుంది. ఈ అంశాలను పరిగణనలోకి తీసుకొని పిటిషనర్లపై నమోదు చేసిన కేసును కొట్టేస్తున్నాం' అని తీర్పులో పేర్కొన్నారు.

Also Read :యోగ టీచర్ నుంచి సినీ ఇండస్ట్రీని శాసించే స్థాయికి.. అనుష్క సినీ జర్నీ

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు