మధుమేహ రోగులు పాలు తాగొచ్చా.? లేదా.? మధుమేహంతో బాధపడేవారు పాలు తాగాలా? వద్దా? అనే గందరగోళం చాలామందిలో తరచుగా కనిపిస్తుంది. దీని పై నిపుణులు ఏం చెబుతున్నారో ఇప్పుడు తెలుసుకుందాం.. By Archana 07 Nov 2024 in లైఫ్ స్టైల్ Latest News In Telugu New Update షేర్ చేయండి 1/6 సాధారణంగా మధుమేహ రోగులు తమ ఆహారపు అలవాట్లు, జీవన శైలి విధానాల పై ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. అయినప్పటికీ చాలా మందిలో ఆహరం పట్ల అనేక అపోహలు, సందేహాలు ఉంటాయి. వాటిలో ఒకటి పాలు. 2/6 మధుమేహ రోగులు పాలు తాగడం వల్ల శరీరంలో చక్కర స్థాయిలు పై ప్రభావం ఉంటుందనే అపోహ కొంతమందికి ఉంటుంది. అయితే నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డయాబెటిక్ పేషంట్లు పాలు తాగితే చక్కర స్థాయిలు పెరుగుతాయి లేదా తగ్గుతాయి అనే దానికి ఎటువంటి ఆధారాలు లేవు. 3/6 వాస్తవానికి పాలల్లో తక్కువ గ్లైసెమిక్ ఉంటుంది. ఇది రక్తంలో చక్కర స్థాయిలు వేగంగా పెరగకుండా సహాయపడుతుంది. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. డయాబెటిక్ రోగులు 190ml కంటే ఎక్కువ పాలు తీసుకోవడం మంచిది కాదు. 4/6 పాలు మధుమేహ రోగులకు ప్రయోజనకరంగా ఉన్నప్పటికీ.. వీటిలో కొవ్వు శాతం ఎక్కువగా ఉంటుంది. ఇది కొంతమందికి సమస్యగా మారే అవకాశం ఉంది. కావున ఎల్లప్పుడూ తక్కువ కొవ్వు కలిగిన పాలను తీసుకోవడం మంచిది. 5/6 అయితే మధుమేహ రోగులు పాలు తాగేటప్పుడు.. వాటికి అదనపు చక్కర జోడించడం మానుకోండి. అలాగే రోజు తాగే పాల పరిమాణం పై ప్రత్యేక శ్రద్ధ వహించండి. ఒక గ్లాస్ కంటే ఎక్కువ పాలు తీసుకోకూడదని నిపుణులు సూచిస్తున్నారు. 6/6 గమనిక: ఈ కథనం ఇంటర్నెట్లో అందుబాటులో ఉన్న సమాచారం ఆధారంగా మాత్రమే ఇచ్చినది. RTV దీనిని ధృవీకరించడంలేదు. ఆరోగ్య సమస్యల నివారణకు సంబంధిత వైద్య నిపుణుడిని సంప్రదించడం ఉత్తమం. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి