AA22xA6: భయపడకు... మరో ప్రపంచం వస్తోంది.. అట్లీ క్రేజీ అప్‌డేట్

అట్లీ తెరకెక్కిస్తున్న పాన్-ఇండియా సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'AA22xA6'లో అల్లు అర్జున్, దీపికా పదుకొనే ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. షూటింగ్ జోరుగా సాగుతోంది. ఈ ప్రాజెక్ట్‌ను రిస్క్‌గా కాకుండా, ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలని చేస్తున్నారు.

New Update
AA22xA6

AA22xA6

AA22xA6: పాన్ ఇండియా సినిమాల క్రేజ్ రోజు రోజుకి పెరిగిపోతున్న టైమ్ లో, ఇప్పుడు మరో భారీ ప్రాజెక్ట్ ప్రేక్షకులలో ఆసక్తిని రేపుతోంది. ప్రముఖ కోలీవుడ్ దర్శకుడు అట్లీ కుమార్(Director Atlee) దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ అడ్వెంచర్ థ్రిల్లర్ ప్రాజెక్ట్ - AA22xA6.

ఈ సినిమాలో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun), బాలీవుడ్ స్టార్ దీపికా పదుకొనే(Deepika Padukone) కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అలాగే మృణాళ్ ఠాకూర్, రష్మిక మందన్న, జాన్వి కపూర్ వంటి పాపులర్ హీరోయిన్స్ కూడా ప్రధాన పాత్రల్లో కనిపించనున్నారు.

Also Read: ఎప్పుడు చూడని కొత్త పాయింట్ ని టచ్ చేశాం: శ్రీనిధి శెట్టి

జోరుగా సినిమా షూటింగ్.. 

ఇటీవల బెంగుళూరులో జరిగిన ఓ స్పోర్ట్స్ ఈవెంట్ (పికిల్‌బాల్ టోర్నమెంట్ – 2025) కు ప్రత్యేక అతిథిగా హాజరైన అట్లీ, మీడియాతో మాట్లాడారు. తన తాజా చిత్రం AA22xA6 గురించి చెప్పిన విషయాలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.

అట్లీ మాట్లాడుతూ.. “ఇప్పటి వరకు ఈ సినిమా షూటింగ్ చాలా బాగా సాగుతోంది. దేవుడు మా ప్రయాణంలో ప్రతి అడుగులో తోడున్నాడు. ఇది సాధారణ సినిమాలా కాదు. ఈ జానర్‌కి ప్రత్యేకమైన గైడ్‌లైన్‌లు లేవు. అందుకే మేమే దారి రూపొందించుకుంటున్నాం. ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇవ్వాలనే లక్ష్యంతో పని చేస్తున్నాం.” అని చెప్పారు.

Also Read: 'బాహుబలి' బడ్జెట్‌ పై అసలు సీక్రెట్ బయట పెట్టిన నిర్మాత శోభు యార్లగడ్డ

రిస్క్ కాదు..

ఇంత పెద్ద బడ్జెట్, విభిన్న కథాంశం ఉన్న ప్రాజెక్ట్‌ను తెరకెక్కించడంలో భయం లేదా అని అడిగితే, అట్లీ చాలా స్పష్టంగా చెప్పారు.. 
“ఇది నాకు రిస్క్ కాదు. నిజంగా నేను ఈ ప్రాజెక్ట్‌ను ఎంజాయ్ చేస్తున్నాను. ఇది పూర్తిగా కొత్తగా ఉంటుంది. ప్రేక్షకులు చూసే విధానాన్ని పూర్తిగా మార్చేసేలా ఉంటుంది. వాళ్లను ఆకర్షించేలా రూపొందిస్తున్నాం.”

Also Read: బాహుబలి: ది ఎపిక్ టికెట్ రేట్ల హైక్ ఉంటుందా..?

అట్లీ ఇంకా మాట్లాడుతూ ఈ సినిమాకు కావాల్సిన విజువల్స్, టెక్నికల్ వర్క్ అన్నీ సరికొత్త స్థాయిలో జరుగుతున్నాయి. ఇంకొన్ని నెలల్లో ఈ సినిమా ప్రపంచాన్ని చూపించబోతున్నామంటూ అభిమానులకు ఓ టీజర్  అప్‌డేట్ హింట్ ఇచ్చారు.

ఈ భారీ సినిమాను సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. సంగీతాన్ని సాయి అభ్యంకర్ అందిస్తున్నారు. టెక్నికల్ గా సినిమాకు అత్యాధునిక టెక్నాలజీని వాడుతున్నారు. ఈ సినిమా కథ, కథన శైలి, విజువల్స్ అన్నీ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని ఇచ్చేలా ఉంటాయని చిత్రబృందం నమ్మకంగా చెబుతోంది.

Also Read: బూతులు ఉంటే తప్పేంటి..? మాస్ జాతర 'ఓలే ఓలే' పాటపై రవితేజ షాకింగ్ కామెంట్స్..

ప్రేక్షకులు ఇప్పటివరకు ఎన్నడూ చూడని విధంగా అట్లీ రూపొందిస్తున్న ఈ సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్‌పై అంచనాలు భారీగా ఉన్నాయి. AA22xA6 సినిమా కొత్త ప్రపంచాన్ని తెరపై చూపించే అవకాశం ఉంది. కొన్ని నెలల్లో ఈ చిత్రంపై మరిన్ని అప్‌డేట్లు రానున్నాయి. 

Advertisment
తాజా కథనాలు