Actress Pranita: కొడుకుకు డిఫరెంట్ పేరు పెట్టిన నటి ప్రణీత.. తెలిస్తే ఆశ్చర్యపోతారు!

నటి ప్రణీత తన రెండవ బిడ్డ నామకరణ మహోత్సవాన్ని బెంగళూరులోని ఓ ప్రైవేట్ హోటల్ లో ఘనంగా చేశారు. ఫ్యాన్సీ పేర్ల వెంట పరుగెడుతున్న ఈ కాలంలో ప్రణీత తన కుమారుడికి జై కృష్ణ అని చక్కటి పేరు పెట్టారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోలు నెట్టింట వైరలవుతున్నాయి.

New Update
actress Pranitha son naming ceremony

actress Pranitha son naming ceremony

Actress Pranita: ప్రముఖ నటి ప్రణీత సుభాష్ దంపతులు  గతేడాది మగబిడ్డకు జన్మనిచ్చిన సంగతి తెలిసిందే. మొదటగా పాప తర్వాత.. రెండవ సంతానంగా కుమారుడు పుట్టాడు. అయితే తాజాగా ప్రణతీ తన కుమారుడి నామకరణ మహోత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ వేడుకకు సెలెబ్రెటీలు, రాజకీయ నాయకులు, ప్రఖులు హాజరయ్యేరు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దిరామయ్యను కూడా ఆహ్వానించింది. అతిథులందరూ ప్రణతి ముద్దుల కుమారుడిని మనసారా ఆశీర్వదించారు. ప్రస్తుతం ఈ నామకరణ మహోత్సవానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. 

Also Read:  Khushboo Patani: చిన్నారిని కాపాడిన దిశా పటాని అక్క .. ఈ విషయం తెలుసుకుంటే సెల్యూట్‌ చేస్తారు

Also Read: Singer Pravasthi మెంటల్ టార్చర్, బాడీ షేమింగ్ చేశారు.. కీరవాణి పై సింగర్ ప్రవస్తి సంచలన ఆరోపణలు!

డిఫరెంట్ గా పేరు.. 

అయితే ప్రణతీ తన కుమారుడికి ఎవరూ ఊహించని విధంగా చక్కటి పేరును నామకరణం చేశారు. పిల్లలు పుట్టగానే ఫ్యాన్సీ పేర్ల కోసం వెతుకుతున్న ఈ రోజుల్లో ప్రణతి తన కుమారుడికి చాలా సింపుల్ గా, పద్దతిగా నామకరణం చేశారు. 'జై కృష్ణ' అని పేరు పెట్టారు. అయితే ప్రణతి ఈ పేరును పెట్టడానికి కారణమేంటో కూడా చెప్పారు. తమ తాత పేరు బాలకృష్ణ, అలాగే హాస్పిటల్ పేరు శ్రీ కృష్ణ, తన భర్త తండ్రి పేరు వాసుదేవ.. కావున ఇలా అందరి పేర్లు కలిసొచ్చేలా తన బిడ్డకు  'జై కృష్ణ' అనే పేరు పెట్టినట్లు తెలిపారు.

అంతేకాదు పురాణాలలోని మహాభారతం నుంచి కూడా ప్రేరణ పొందినట్లు తెలుస్తోంది. ఒకప్పుడు వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా రాణించిన ప్రణతి.. పెళ్లి తర్వాత వ్యక్తిగత జీవితంతో బిజీ అయిపోయారు. అప్పుడప్పుడు టీవీ షోలు, ఈవెంట్లలో సందడి చేస్తోంది. 

cinema-news | latest-news | actress-pranita-subash  

Also Read :  ఇంత టాలెంటెడ్‌గా ఉన్నావేంట్రా.. ‘సీఎం రేవంతన్న కుదిర్చిన ముహూర్తానికే నా పెళ్లి.. లేదంటే’!

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు