Actress Pranita : పండంటి బిడ్డకు జన్మనిచ్చిన పవన్ హీరోయిన్..
హీరోయిన్ ప్రణీత రెండో సారి తల్లయ్యారు. ఇప్పటికే ఆమెకు 'ఆర్నా' అనే కూతురు ఉన్న విషయం తెలిసిందే. ఈసారి మగబిడ్డకు జన్మనిచ్చారు. దీంతో సినీ ప్రముఖులు, అభిమానులు ఆమెకు శుభాకాంక్షలు తెలుపుతూ కామెంట్స్ పెడుతున్నారు. రెండోసారి తల్లి కావడంపై ప్రణీత స్పందిస్తూ ఆనందం వ్యక్తంచేశారు.