సర్దార్ 2 షూటింగ్ లో ప్రమాదం.. 20 అడుగుల ఎత్తు నుంచి పడి మృతి చెందిన స్టంట్మెన్!
తమిళ హీరో కార్తీ నటిస్తున్న సర్దార్-2 చిత్రం షూటింగ్ లో ప్రమాదం చోటు చేసుకుంది. చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్ లో చిత్రం యాక్షన్ సీన్స్ ను మూవీబృందం చిత్రీకరిస్తుంది. అదే సమయంలో ఎజుమలై అనే స్టంట్మెన్ 20 అడుగుల ఎత్తునుంచి కింద పడి మరణించినట్టు కోలీవుడ్ లో వార్తలు వినిపిస్తున్నాయి.