/rtv/media/media_files/2025/04/19/Rthl5SipCmIjd2u9m1Xq.jpg)
Actors Bobby Simha Car Rams Six Vehicles In Chennai 3 Injured Driver Arrested
తమిళనాడులోని చెన్నైలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ప్రముఖ స్టార్ యాక్టర్, జాతీయ అవార్డు గ్రహీత బాబీ సింహా కారు శనివారం ఉదయం బీభత్సం సృష్టించింది. ఎక్కడుతంగల్ – చెన్నై ఎయిర్‌పోర్ట్ రోడ్డులో కారు రయ్ రయ్ మంటూ చక్కర్లు కొట్టి వాహనాల పైకి దూసుకెళ్లింది. కారు అదుపుతప్పి ముందు వెళ్తున్న వెహికల్స్ పైకి వెళ్లడంతో ప్రమాదం జరిగింది.
Also Read: కొడుకులు పారిపోతున్నా కొబ్బరి బోండాల కత్తితో నరికి.. వెలుగులోకి షాకింగ్ నిజాలు
తీవ్ర గాయాలు
ఈ ప్రమాదంలో కారు ముందు భాగం తీవ్రంగా దెబ్బతింది. ఒక మహిళ సహా ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. మరో 6కి పైగా వాహనాలు ద్వంసమయ్యాయి. వెంటనే స్థానికులు గుర్తించి గాయపడిన వారిని సమీప హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు సంఘటనా స్థలనికి చేరుకుని పూర్తి వివరాలు సేకరించారు.
Also Read: తెలంగాణ ఈపీసెట్ పరీక్షలు..నేటి నుంచే అందుబాటులోకి హాల్ టికెట్లు!
పోలీసుల ప్రకారం.. ఎక్కడుతంగల్ నుంచి చెన్నై ఎయిర్‌పోర్ట్‌కు వెళ్తున్న నటుడు బాబీ సింహా కారు.. అలందూర్ మెట్రో స్టేషన్ వైపు ఉన్న కత్తిపార ఫ్లైఓవర్ దిగుతుండగా అదుపుతప్పింది. దీంతో ముందు వెళ్తున్న వాహనాలపైకి దూసుకెళ్లింది. అయితే ఈ ఘటన సమయంలో నటుడు బాబీ సింహా కారులో లేడని పోలీసులు వెల్లడించారు. కాగా బాబీ సింహా తండ్రిని ఇంట్లో వదిలి తిరిగి వస్తుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది.
Also Read: ఐదేళ్ల తర్వాత మానస సరోవర యాత్రకు ఓకే..భారత, చైనా సంబంధాల్లో కీలక మలుపు
ఇక డ్రైవర్ పుష్పరాజ్ మద్యం మత్తులో కారు నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అనంతరం అతడిని కస్టడీకి తీసుకుని విచారించగా.. మద్యం సేవించి వాహనం నడుపుతున్నాడని తేలింది. తర్వాత పోలీసులు డ్రైవర్ పుష్పరాజ్‌ను అరెస్టు చేసి కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతరం కోర్టులో హాజరుపరిచారు. మద్యం సేవించి కారు నడిపి ప్రమాదానికి కారణమైన నేరానికి గాను 30వ తేదీ వరకు జైలు శిక్ష విధిస్తూ అలందూరు కోర్టు ఆదేశించింది.
Also Read: మరో 5 రోజులు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు..వాతావరణశాఖ హెచ్చరికలు!
actor-bobby-simha | latest-telugu-news | telugu-news