Vertu Ascent Retro Classic: ఫహాద్ ఫాజిల్ కీప్యాడ్ ఫోన్ ధర రూ.10లక్షలు.. ఫీచర్లు తెలిస్తే నోరెళ్లబెట్టాల్సిందే..!

నటుడు ఫహాద్ ఫాజిల్ కీప్యాడ్ ఫోన్ అందరి దృష్టిని ఆకర్షించింది. ఈ ఫోన్ పేరు Vertu Ascent Retro Classic Keypad Phone. దీని ధర రూ. 10 లక్షలకు పైగా ఉంటుందని తెలిసి నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ ఫోన్‌లలో ఒకటిగా ఉంది.

New Update
Vertu Ascent Retro Classic Keypad Phone

Vertu Ascent Retro Classic Keypad Phone price and specifications

నటుడు ఫహాద్ ఫాజిల్ ఇటీవల ఒక సినిమా వేడుకలో అందరి దృష్టిని ఆకర్షించాడు. ముఖ్యంగా ఆయన చేతిలోని కీప్యాడ్ ఫోన్ అందరినీ అట్రాక్ట్ చేసింది. దీంతో ఆ ఫోన్‌ బ్రాండ్ ఏంటి?, దాని ధర ఎంత?, అది ఎక్కడ దొరుకుతుంది? అనే దాని గురించి నెటిజన్లు ఇంటర్నెట్‌లో వెతికేశారు. ఆఖరికి ఆ ఫోన్ ధర తెలిసి నోరెళ్లబెట్టారు. అది మామూలు ఫోన్ కాదని.. దాని ధర రూ. 10 లక్షలకు పైగా ఉంటుందని తెలిసి ఆశ్చర్యపోయారు. దీంతో ఆ ఫోన్ చర్చనీయాంశంగా మారింది. ఆ ఫోన్‌కు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళితే.. 

Also Read: లోక్‌సభలో పహల్గాం ఉగ్రదాడిపై చర్చించాలని విపక్షాల పట్టు.. సభ వాయిదా

Vertu Ascent Retro Classic Keypad Phone Price

ఆయన ఉపయోగిస్తున్న ఫోన్ పేరు ‘Vertu Ascent Retro Classic Keypad Phone’. ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లగ్జరీ ఫోన్‌లలో ఒకటిగా ఉంది. Vertu అనేది యూకేకు చెందిన ఒక హ్యాండ్‌క్రాఫ్టెడ్ లగ్జరీ మొబైల్ ఫోన్ కంపెనీ. ఈ Vertu Ascent Retro Classic కీప్యాడ్ ఫోన్ ధర సుమారు రూ.10 లక్షలు ఉంటుంది. ఈ ఫోన్‌ను టైటానియం, నీలమణి క్రిస్టల్ (sapphire crystal), చేతితో కుట్టిన లెదర్ వంటి అత్యంత ఖరీదైన పదార్థాలతో తయారు చేస్తారు. ఇవన్నీ వాచీలు, లగ్జరీ కార్లలో ఉపయోగించే మెటీరియల్స్ కావడంతో మరింత గ్రాండ్‌గా ఉంటుంది. 

Also Read: వీడసలు మనిషేనా.. రూ.20 కోసం కన్నతల్లిని చంపిన కసాయి.. ఎక్కడంటే?

ఈ వర్టూ ఫోన్‌లను భారీ యంత్రాలతో కాకుండా.. నిపుణులైన కళాకారులు చేతితో తయారు చేస్తారు. ప్రతి ఫోన్ తయారీకి చాలా సమయం కేటాయిస్తారు. ఈ ఫోన్‌లను సెలబ్రిటీలు, రాయల్టీ, సంపన్న వ్యక్తుల కోసం మాత్రమే ప్రత్యేకంగా డిజైన్ చేస్తారు. అందువల్ల ఇది కేవలం ఒక ఫోన్‌గా కాకుండా.. స్టేటస్ సింబల్‌గా భావిస్తారు. 

Also Read:ఈ వారం ఓటీటీ, థియేటర్ లో రచ్చ రచ్చ.. ఫుల్ సినిమాలు లిస్ట్ ఇదే

Vertu Ascent Retro Classic Keypad Phone Specs

ఈ ఫోన్ 2007-2008 సమయంలో విడుదలైంది. అందువల్ల ఇది పాత మోడల్ అయినందున.. దీని స్పెసిఫికేషన్లు నేటి స్మార్ట్‌ఫోన్‌లతో పోలిస్తే చాలా డిఫరెంట్‌గా ఉంటాయి. ఇది 2.0 అంగుళాల TFT డిస్‌ప్లే, 240 x 320 పిక్సెల్స్ రిజల్యూషన్‌తో ఉంటుంది. కొన్ని మోడల్స్‌లో 5 MP కెమెరా (అసెంట్ Ti వంటివి) ఉండే అవకాశం ఉంది. బ్లూటూత్, GPRS, USB వంటి ప్రాథమిక కనెక్టివిటీ ఫీచర్లు.. Wi-Fi లేదా 4G/5G ఉండవు. వర్టూ సొంత ఆపరేటింగ్ సిస్టమ్ పై నడుస్తుంది. స్టోరేజ్ ఆప్షన్ చాలా తక్కువ. సాధారణ కీప్యాడ్ ఫోన్‌కు తగ్గట్టుగా బ్యాటరీ లైఫ్ ఉంటుంది. 

Advertisment
Advertisment
తాజా కథనాలు