Actor Darshan ''నాకు విషమివ్వండి.. జైల్లో జీవించలేకపోతున్నాను''! దర్శన్ సంచలన వ్యాఖ్యలు

నాకు కాస్త విషమివ్వండి .. జైల్లో పరిస్థితులను భరించలేకపోతున్నాను అంటూ కన్నడ నటుడు దర్శన్ కోర్టును వేడుకోవడం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.

New Update
actor darshan

actor darshan

Actor Darshan: నాకు కాస్త విషమివ్వండి .. జైల్లో  పరిస్థితులను భరించలేకపోతున్నాను అంటూ కోర్టును వేడుకోవడం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. అభిమాని రేణుకస్వామి హత్య కేసులో దర్శన్  కొన్ని రోజులుగా బెంగళూరు పరప్పన అగ్రహారం జైల్లో నిందితుడిగా జైలు జీవితం గడుపుతున్నాడు. కాగా, మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జైలు నుంచి కోర్టులో విచారణకు హాజరైన దర్శన్(actor-darshan)  అగ్రహారం జైల్లో సరైన సదుపాయాలు లేవని న్యాయవాది ముందు వాపోయాడు. గత నెల రోజులుగా తాను సూర్యరశ్మిని చూడలేదని, తన చేతులకు ఫంగస్ వచ్చిందని, ఈ కష్టాలను భరించలేకపోతున్నానని ఆవేదన చెందాడు. ఇలాంటి పరిస్థితుల్లో జీవించలేకపోతున్నాను.. కాస్త విషమివ్వండి అంటూ కన్నీరు పెట్టుకున్నాడు. దీంతో జడ్జ్ ఇలాంటి కోరికలు కోరవద్దని సలహా ఇచ్చారు. జైలు అధికారులతో మాట్లాడి తగిన ఆదేశాలు జారీ చేస్తామని హామీ ఇచ్చారు. దర్శన్ అడిగిన తలగడ, దుప్పట్లు, ఇంటి నుంచి  తెప్పించుకున్న ఆహారం వంటి వాటిపై కూడా మధ్యాహ్నం ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు. న్యాయమూర్తి మాటలకు దర్శన్ అంగీకరించి మౌనంగా ఉండిపోయాడు.

Also Read :  BIGG BOSS PROMO: ఫుల్ ఫైర్!  ఆర్మీ జవాన్ VS సంజన.. సెలబ్రెటీలకు చుక్కలు చూపిస్తున్న కామనర్స్ !

Actor Darshan Asks Judge For Poison

అయితే అభిమాని రేణుకస్వామి హత్య కేసులో అరెస్టైన దర్శన్ కి కర్ణాటక హైకోర్టు గతేడాది డిసెంబర్ 3న బెయిల్ మంజూరు చేసింది. కానీ, రేణుకస్వామి తరపు న్యాయవాది హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ .. దర్శన్ బెయిల్ రద్దు చేయాలని సుప్రీం కోర్టులో పిటీషన్ వేశారు. దీనిపై విచారణ జరిపిన సుప్రీం కోర్ట్ దర్శన్ బెయిల్ రద్దు చేస్తూ.. వెంటనే అతడిని అదుపులోకి తీసుకోవాలని పోలీసులను ఆదేశించింది. దర్శన్ కి బెయిల్ ఇవ్వడానికి చట్టపరమైన కారణాలేవి కనిపించడం లేదని  తెలిపింది.  సుప్రీం కోర్ట్ తీర్పుతో ఈ ఏడాది ఆగస్టు 14న మళ్ళీ దర్శన్ ని అదుపులోకి తీసుకొని జైలుకి తరలించారు పోలీసులు. 

Also Read :  అప్పులు చేసి చనిపోతే ఊరంతా కదిలొచ్చింది..ఆ నలుగురు సినిమా వెనుక రియల్ స్టోరీ!

Advertisment
తాజా కథనాలు