/rtv/media/media_files/2025/09/09/aa-naluguru-movie-2025-09-09-15-55-56.jpg)
Aa Naluguru Movie
Aa Naluguru: సీనియర్ నటులు రాజేంద్ర ప్రసాద్(Actor Rajendraprasad), కోట శ్రీనివాస్ రావు(Kota Srinivasa Rao) ప్రధాన పాత్రలో నటించిన 'ఆ నలుగురు' సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. అసలిది మర్చిపోయే సినిమా అయితే కదా, గుర్తుపెట్టుకోవడానికి! కొన్ని సినిమాలు క్షణకాలిక వినోదాన్ని, ఆనందాన్ని ఇస్తే.. మరికొన్ని సినిమాలు మాత్రం మనిషని ఆలోచింపజేసేలా చేస్తాయి. అలా ఆలోచింపజేసేలా చేసిన చిత్రాల్లో ఆ నలుగురు ఒకటి. డబ్బు కంటే మానవ సంబంధాలు, సాటి మనిషికి సహాయపడే మనసు ముఖ్యమనే గొప్ప సందేశాన్ని ఇచ్చిన చిత్రమిది. "రూపాయి.. రూపాయి.. నువ్వేం చేస్తావని అడిగితే.. హరిశ్చంద్రుడితో అబద్ధం చెప్పిస్తాను, భార్యాభర్తల మధ్య చిచ్చు పెడతాను, తండ్రి బిడ్డలని విడదీస్తాను, అన్నాదమ్ముల మధ్య వైరం పెంచుతాను, ఆఖరికి ప్రాణ స్నేహితుల్ని కూడా విడగొడతాను అందట'' అంటూ సినిమాలో రాజేంద్రప్రసాద్ చెప్పిన డైలాగ్ మనిషకి డబ్బు పిచ్చి ఎంత ప్రమాదకరం అనే విషయాన్నీ ఎత్తి చూపిస్తుంది.
Also Read : BIGG BOSS PROMO: ఫుల్ ఫైర్! ఆర్మీ జవాన్ VS సంజన.. సెలబ్రెటీలకు చుక్కలు చూపిస్తున్న కామనర్స్ !
Aa Naluguru Movie Is Real Story
How many of you watched this film
— TeluguCinemaHistory (@CineLoversTFI) March 18, 2020
' #AaNaluguru, 2004 '
Directed by ' Chandra Siddhartha '
Music Composed by ' R.P. Patnaik '
Story n Dialogues ' Madan '
This film Won Three Nandi Awards including Best Actor #RajendraPrasadpic.twitter.com/MJ48u9aSzW
అయితే మొదట సీరియల్ గా కూడా తీయడానికి పనికిరాదనుకున్న ఈ సినిమా ఇండస్ట్రీ రికార్డ్ క్రియేట్ చేసింది. జీవితంలో ఇలాంటి సినిమా ఒక్కసారైనా చూడాలి అనే స్థాయిలో ప్రేక్షకాదరణ పొందింది. మరి ఇంతటి అద్భుతమైన కథ రాయాలనే ఆలోచన రైటర్ మదన్ కి ఎలా వచ్చింది అనే ఆలోచన మీకు ఎప్పుడైనా వచ్చింది. ఈ కథ వెనుక చాలా మందికి తెలియని ఒక రియల్ స్టోరీ ఉంది! అదేంటో ఇప్పుడు తెలుసుకుందాం..
రైటర్ మదన్ చిత్తూరు జిల్లా మదనపల్లెలో చదువుకునే రోజులవి. అయితే ఒకరోజు మదన్ అక్కడికి సమీపంలోని బీ.కొత్తకోట గ్రామంలో ఓ విషాదకర సంఘటనను చూశారు. ఆ గ్రామంలోని ఓ వ్యక్తి ఊరంతా అప్పులు చేసి చనిపోతాడు. కానీ, ఆశ్చర్యకరంగా అతడి అంతిమ యాత్రకు ఊరంతా కదిలి వస్తుంది. ఊరంతా అప్పులు చేసినవాడు కోసం జనం ఎందుకు వస్తారు అని ఆలోచిస్తున్నారా? అయితే ఆ వ్యక్తి తన కోసం అప్పులు చేయలేదు! కష్టాల్లో ఉన్నవారిని ఆదుకోవడానికి అప్పు చేసి సహాయం చేశాడు. తనతో పాటు చుట్టూ ఉన్నవాళ్ళు కూడా బావుండాలని కోరుకునేవారు. అందుకే అతడు మరణించినప్పుడు ఊరు ఊరంతా ఆయన అంతిమయాత్రకు తరలివచ్చి కన్నీరు కార్చారు. ఈ సంఘటన మదన్ మనస్సును కదిలిచింది. అప్పుడే అతడి మనసులో 'ఆ నలుగురు' సినిమా కథకు బీజం పడింది.
Also Read : Bigg Boss Priya shetty: డాక్టర్ జాబ్ వదిలేసి బిగ్ బాస్ లోకి.. ప్రియా శెట్టి బ్యాక్ గ్రౌండ్ తెలిస్తే షాక్!