/rtv/media/media_files/2025/03/14/1JGfaUX4fHWG6SoDsGX4.jpg)
ameer KHAN Photograph: (ameer KHAN)
బాలీవుడ్ స్టార్ హీరో ఆమిర్ ఖాన్ గురువారం తన 60వ పుట్టినరోజు సందర్భంగా మీడియాతో ముచ్చటించారు. మీడియా సమక్షంలో కేక్ కట్ చేసి బర్త్ డే సెలబ్రేషన్స్ చేసుకున్నారు. తన తదుపరి సినిమా విశేషాలు, షారుక్, సల్మాన్‌లతో తన అనుబంధం గురించి మాట్లాడారు. అతని స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌తో డేటింగ్‌లో ఉన్నట్లు ఆమిర్‌ఖాన్ సందర్భంగా వెల్లడించారు. 25 సంవత్సరాలుగా తనకు ఆమె తెలుసని అన్నారు. 2021లో తన భార్య కిరణ్ రావుతో ఆమిర్ విడాకులు తీసుకున్న విషయం తెలిసిందే. అంతకుముందు రీనా దత్తాను పెళ్లి చేసుకొని విడిపోయారు.
ఎవరీ గౌరీ స్ప్రాట్
గౌరీ స్ప్రాట్ ప్రస్తుతం బెంగుళూరులో నివసిస్తున్నారు. ఆమెకు ఆరేళ్ల కుమారుడు కూడా ఉన్నాడు. ఆమె ప్రస్తుతం అమీర్ ప్రొడక్షన్ బ్యానర్‌లో పనిచేస్తోంది. ఆమె ఫ్యామిలీకి విభిన్న నేపథ్యం ఉంది. తల్లి తమిళనాడుకు చెందింది. తండ్రి ఐరిష్ సిటిజన్. ఆమె తాత స్వాతంత్ర్య సమరయోధుడు. వీళ్ల రిలేషన్ గౌరీ ఇంట్లో కూడా తెలుసు అట.
‘60 ki umar me shaadi...’: Aamir Khan addresses marriage plans with girlfriend Gauri Spratthttps://t.co/vRVZQS7EqH
— HT Entertainment (@htshowbiz) March 14, 2025
ఆమీర్ ఖాన్ డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. మహాభారత్ నా డ్రీమ్ ప్రాజెక్ట్. భారీ స్థాయిలో దానిని సిద్ధం చేయాలని అనుకుంటున్నాం. ఆ మేరకు పనులు ప్రారంభిస్తున్నాం. స్క్రిప్ట్ వర్క్ మాత్రమే మొదలు పెడుతున్నాం. దీని కోసం ఒక టీమ్‌ను సిద్ధం చేసే పనిలో ఉన్నామని ఆయన చెప్పారు. మహాభారత్ మూవీ ప్రాజెక్ట్ గురించి ఆయన గతంలోనూ మాట్లాడారు.
Also read: Jana Sena: జనసేనతో పవనన్న ప్రయాణం ఇదే.. ఒక్కడిగా మొదలై
మహాభారత్ మీద సినిమా చేయడమంటే ఒక యజ్ఞంతో సమానం అన్నారు. దానిని విశిష్టతకు భంగం కలిగించకుండా సినిమా రూపొందించేందుకు శ్రమిస్తున్నానన్నారు. ఆ ప్రాజెక్ట్ విషయంలో తాను ఎంతో భయంతో ఉన్నట్లు కూడా చెప్పారు. షారుక్, సల్మాన్‌లతో కలిసి నటించే అవకాశం వస్తే బాగుంటుందని ఆయన కోరుకున్నారు. మా ముగ్గురి కాంబోలో సినిమా వస్తే బాగుంటుందని మేము కూడా అనుకుంటున్నామని మీడియా ముందు చెప్పేశారు.
Also read : ఆ విషయంలో నేనే నంబర్.1.. ఢిల్లీలో సీఎం రేవంత్ సంచలన వ్యాఖ్యలు!