Megastar : రాజకీయాల్లో హుందాతనం లేదు.. సన్మాన వేదికపై ఇచ్చిపడేసిన చిరు

శిల్పకళా వేదికగా తెలంగాణ గవర్నమెంట్ నిర్వహించిన సన్మాన కార్యక్రమంలో చిరంజీవి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజకీయాల్లో హుందాతనం లేదన్నారు. దుర్భషలాడేవారిని రాజకీయాల్లో నుంచి పంపించేసే శక్తి ప్రజలకే ఉంటుందంటూ పరోక్షంగా చురకలంటించారు.

New Update
Megastar : రాజకీయాల్లో హుందాతనం లేదు.. సన్మాన వేదికపై ఇచ్చిపడేసిన చిరు

Telangana : ప్రతిష్టాత్మకమైన పద్మవిభూషన్‌ అవార్డు కు ఎంపికైన వెంకయ్య నాయుడు(Venkaiah Naidu), చిరంజీవి లను శిల్పకళా వేదిక(Shilpakala Vedika) గా తెలంగాణ(Telangana) గవర్నమెంట్ ఘనంగా సన్మానించింది. సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క(Bhatti Vikramarka), మంత్రుల సమక్షంలో వారికి జ్ఞాపికను అందించి శాలువతో సత్కరించారు. అయితే ఈ సందర్భంగా మాట్లాడిన సీఎం రేవంత్.. నటుడు చిరుకు అవార్డు రావడం తెలుగువారికి గర్వకారణమని అన్నారు.

హుందాతనం లేదు..
ఇక సన్మానం అనంతరం మాట్లాడిన చిరంజీవి(Chiranjeevi).. తనకు ఈ గౌరవం దక్కినందుకు సంతోషంగా ఉందన్నారు. అలాగే రాజకీయాల గురించి ప్రత్యేకంగా మాట్లాడి మెగస్టార్.. సూటిపోటి మాటలు పడలేక, వాటిని తట్టుకోలేక రాజకీయాల్లో ఉండలేకపోయానన్నారు. 'విమర్శల దాడిని తిప్పి కొట్టగలిగితేనే రాజకీయాల్లో ఉండగలం. మన వాళ్ళను మనం గౌరవించలేకపోతే ఎలా? దుర్భషలాడేవారిని రాజకీయాల్లో నుంచి పంపిచేసే శక్తి ప్రజలకే ఉంటుంది. నేటి రాజకీయాల్లో హుందాతనం లేదు' అంటూ పరోక్షంగా చురకలంటించారు.

కళాకారులకు ఎంతో ప్రోత్సాహం..
ఇక అవార్డులు కళాకారులకు ఎంతో ప్రోత్సాహం అందిస్తాయన్నారు. గద్దర్(Gaddar) పేరుతో నంది అవార్డులు ఇవ్వడం ఎంతో ఆనందంగా ఉందని, అవార్డులు ప్రకటించిన వెంటనే ఇలా సన్మానం చేయడం ఇదే తొలిసారి అంటూ ఆనందం వ్యక్తం చేశారు. 'పద్మవిభూషణ్‌(Padma Vibhushan Award) ప్రకటించినప్పుడు వచ్చిన ఆనందం అంతా ఇంతా కాదు. అభిమానుల ఆశీర్వాదాలు చూస్తుంటే నా జన్మ ధన్యమైంది అనిపిస్తుంది. పురస్కారాలు ప్రకటించిన వెంటనే సన్మానం చేయాలనే ఆలోచన ఇంతవరకు ఎవరికీ రాలేదు' అన్నారు. కొన్నేళ్లుగా నంది అవార్డులను చాలాకాలం నిలిపివేయడం నిరుత్సాహపరిచింది. నంది అవార్డుల పేరు గద్డర్‌ అవార్డులుగా మార్చడం ఎంతో సముచితం, ఆనందంగా ఉంది. గద్దర్‌ అవార్డులు త్వరలో ఇస్తామని ప్రకటించడం సంతోషదాయకం. ఎక్కడ కాళాకారులు గౌరవించబడతారో ఆ రాజ్యం సుభిక్షంగా ఉంటుందని తెలిపారు.

ఇది కూడా చదవండి: IND VS ENG: ప్రధాన వికెట్లు ఫట్‌.. ఆ ఒక్కడిపైనే భారం.. ఏం జరుగుతుందో ఏమో?

నిజమైన రాజనీతిజ్ఞుడు..
అలాగే రాజకీయాలకు వెంకయ్యనాయుడు రియల్‌స్టేట్స్‌మెన్‌. రాజకీయాల్లో వెంకయ్యనాయుడు నిజమైన రాజనీతిజ్ఞుడు అంటూ ప్రశంసలు కురిపించారు చిరు. మోడీని కూడా పొగిడేశాడు. ఇక వీరితోపాటు పద్మశ్రీ పురస్కారానికి ఎంపికైన దాసరి కొండప్ప, గడ్డం సమ్మయ్య, ఆనందాచారి, కేతావత్‌ సోమ్‌లాల్‌, కూరెళ్ల విఠలాచార్యలను కూడా సత్కరించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు జూపల్లి కృష్ణారావు, కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Advertisment
తాజా కథనాలు