Controversial comments:సింగర్ చిన్మయి వివాదం మరోసారి తెరపైకి వచ్చింది. ఈసారి ఆమె పెద్ద తలకాయల మీదనే అసహనం వ్యక్తం చేసింది. ఇందులో తమిళనాడు సీఎంతో పాటూ కమల్ హసన్, చిదంబరం కూడా ఉన్నారు. అసలేం జరిగిందంటే...ప్రముఖ తమిళ రచయిత వైరముత్తు రాసిన మహా కవితై పుస్తకావిష్కరణ చెన్నైలో జరిగింది. దీనిని తమిళనాడు సీఎం స్టాలిన్, సీనియర్ కాంగ్రెస్ నాయకుడు చిదంబరం, కమల్ హసన్ లు ఆవిష్కరించారు. దీన్ని సింగర్ చిన్మయి తప్పుబట్టింది. తనను లైంగికంగా వేధించిన వ్యక్తిని పెద్దవాళ్ళు సపోర్ట్ చేస్తున్నారంటూ బాధపడింది. తనకు న్యాయం ఎప్పుడు జరుగుతుందో అంటూ ఆవేదన వ్యక్తం చేసింది.
Also Read:ధర్నా విరమించారు…పెట్రోల్‌కు ఢోకాలేదింక
చిన్మయి...సింగర్, డబ్బింగ్ ఆర్టిస్. ఈమె 2018లో తమిళ రచయిత వైరముత్తు తనను లైంగికంగా వేధించాడంటూ ఆరోపణలు చేసింది. మీటూ ఉద్యమం సమయంలో చిన్మయి బయటపడింది. ఈమెతో పాటూ వైరముత్తు మీద మరికొంతమంది కూడా ఆరోపణలు చేశారు. అయితే ఎవరూ వైరముత్తును ఏమీ అనలేదు కదా తిరిగి చిన్మయినే తమిళ ఇండస్ట్రీ నిషేధించింది. దీంతో పాపం చిన్మయి అప్పటి నుంచి తన ఆవేదనను సమయం వచ్చినప్పుడల్లా వ్యక్తపరుస్తూనే ఉంది. ఇప్పుడు కూడా వైరముత్తు పుస్తకాన్ని ఆవిష్కరించి, ఈతనికి సపోర్ట్ చేస్తున్నందుకే సీఎం స్టాలిన్, కమల్ హసన్‌ల మీద విమర్శలు చేసింది.