China Fertility Rate Drop : చైనాలో రికార్డు స్థాయిలో తగ్గిన సంతానోత్పత్తి రేటు...!!

జనాభా పెరిగినా కష్టమే..తగ్గిన కష్టమే. చైనాను చూస్తుంటే ఇది నిజమే అనక తప్పదు. మొన్నటివరకు అత్యధిక జనాభాతో ఎంత ఉత్పాదకత ఉన్నా ఉత్పత్తులు సరిపోక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంది. ఇప్పుడేమో జనాభా తగ్గిపోయి..పనిచేసే వయస్సున్న వారి సంఖ్య క్షీణించడంతో తీవ్ర అవస్థలు పడుతోంది. చైనాలో జనాభా ఊహించినదాని కంటే వేగంగా తగ్గిపోతుంది. చైనా సంతానోత్పత్తి రేటు 2022లో రికార్డు స్థాయిలో 1.09కి పడిపోయిందని నేషనల్ బిజినెస్ డైలీ మంగళవారం తెలిపింది.

China Fertility Rate Drop :  చైనాలో రికార్డు స్థాయిలో తగ్గిన సంతానోత్పత్తి రేటు...!!
New Update

China Fertility Rate Drop: చైనా సంతానోత్పత్తి రేటు తగ్గుతోంది. గత 60ఏళ్లలో సంతానోత్పత్తి కంటే మరణాలే ఎక్కువగా నమోదు అయ్యాయి. ప్రపంచంలోనే అత్యధిక జనాభా (Highest Population) కలిగిన చైనా మొదటిసారిగా సంతానోత్పత్తి రేటులో రికార్డుస్థాయిలో క్షీణించింది. 2022లో రికార్డు స్థాయిలో సంతానోత్పత్తి 1.09కి పడిపోయిందని నేషనల్ బిజినెస్ డైలీ మంగళవారం తెలిపింది. 100 మిలియన్ల కంటే ఎక్కువ జనాభా ఉన్న దేశాలలో ఇది అత్యల్ప సంతానోత్పత్తి స్థాయిని కలిగి ఉందని చైనా పాపులేషన్ అండే డెవలప్ మెంట్ సెర్చ్ సెంటర్ తెలిపింది. డిసెంబర్ 2022-జనవరి 2023 మధ్య చైనా హాస్పిటల్స్ లో సుమారు 60వేల మంది కోవిడ్ (Covid) కారణంగా మరణించారు.

చైనాలో తగ్గుతున్న జనాభా ఆదేశ సంక్షోభానికి (Crisis) దారితీస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆరు దశాబ్దాల్లో మొదటిసారి...సంతానోత్పత్తి కంటే మరణాల రేటు ఎక్కువగా ఉందని నేషనల్ బిజినెస్ డైలీ (National Business Daily) వెల్లడించింది. ఇదిలాగే ఉంటే చైనా స్థానాన్ని భారత్ (India) భర్తీ చేస్తుంది. చైనా సంతానోత్పత్తి రేటు ఇప్పటికే దక్షిణ కొరియా , తైవాన్ , హాంకాంగ్ , సింగపూర్‌లతో పాటు ప్రపంచంలోనే అత్యల్పంగా ఉంది .

ఆరు దశాబ్దాలలో మొదటిసారిగా చైనాలో జనాభా రికార్డు స్థాయిలో తగ్గింది. దాని వేగవంతమైన వృద్ధాప్య జనాభా గురించి ఆందోళన చెందుతున్న బీజింగ్ , ఆర్థిక ప్రోత్సాహకాలు, మెరుగైన పిల్లల సంరక్షణ సౌకర్యాలతో సహా జనన రేటును పెంచడానికి అత్యవసరంగా అనేక చర్యలను ప్రయత్నిస్తోంది. అధ్యక్షుడు జి జిన్‌పింగ్ (Xi Jinping) ఈ అంశాన్ని అధ్యయనం చేయడానికి సమావేశాన్ని నిర్వహించారు. జనాభా నాణ్యతను మెరుగుపరచడానికి విద్య, సైన్స్ ,టెక్నాలజీపై దృష్టి సారిస్తుందని..భవిష్యత్తులో ఆర్థిక వృద్ధికి తోడ్పడటానికి "మితమైన సంతానోత్పత్తి" స్థాయిని కొనసాగించడానికి ప్రయత్నిస్తామని చైనా తెలిపింది.

పిల్లల సంరక్షణ ఖర్చులు, వారి కెరీర్ ను మధ్యలోనే ఆపివేయం వంటి సమస్యల కారణంగా చాలా మంది మహిళలు పిల్లలను కనేందుకు ఆసక్తి చూపడం లేదని ఓ సర్వేలో తేలింది. అంతేకాదు లింగవివక్ష, పిల్లలను చూసుకునే మహిళల సాంప్రదాయ మూసలు ఇప్పటికే దేశవ్యాప్తంగా ఉన్నాయి. జనాభాను పెంచేందుకు చైనా చర్యలు చేపట్టింది. 35ఏళ్లుగా అమలులో ఉన్న ఒక బిడ్డ విధానానికి స్వస్తి పలికింది. ఈ పరిమితిని మూడుకు పెంచింది చైనా. సంతానోత్పత్తికోసం పలు రకాల ప్రోత్సకాలను కూడా అందించింది. అందులో పన్ను తగ్గింపులు, ఆస్తి పన్ను రాయితీలు వంటివి ఉన్నాయి. అయినా కూడా చైనాలో సంతానోత్పతి రేటు రికార్డుస్థాయిలో క్షీణించడం అక్కడి ప్రభుత్వాన్ని ఆందోళనకు గురిచేస్తుంది.

Also Read: ఇథియోపియాలో ఎయిర్ స్ట్రైక్స్… 26 మంది మృతి….!

#singapore #china #south-korea #xi-jinping #beijing #taiwan #china-fertility-rate-drop #fertility-rate #chinas-fertility-rate #record-low-fertility #china-fertility-rate #chinas-fertility-rate-drops-to-record-low-1-09-in-2022 #china-fertility-rate-dropped
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe