EVMs: ఈవీఎంలపై భయాందోళనలు అనవసరమన్న ఎన్నికల కమిషనర్‌..

ఈవీఎంల వినియోగంపై భయాందోళన అనవసరమని కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ అన్నారు. అలాగే ఒకరికి బదులు మరొకరు ఓట్లు వేయడంపై దృష్టి సారించాలని.. యంత్రంగానికి సూచనలు చేసినట్లు పేర్కొన్నారు.

New Update
EVMs: ఈవీఎంలపై భయాందోళనలు అనవసరమన్న ఎన్నికల కమిషనర్‌..

EVMs: మరికొన్ని రోజుల్లో లోక్‌సభ ఎన్నికలు.. అలాగే పలు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎలక్ట్రానిక్ ఓటింగ్‌ యంత్రాలు (EVM)ల వాడకంపై కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ రాజీవ్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈవీఎంల వినియోగంపై భయాందోళన అనవసరమని అన్నారు. వాటిలో ఎవరూ కూడా ఎలాంటి మార్పులు చేయడం సాధ్యం కాదని అన్నారు. ఉత్తరప్రదేశ్‌లోని సార్వత్రిక ఎన్నికల సన్నద్ధతనపై ఆయన శనివారం లక్నోలోని సమీక్ష నిర్వహించారు. ఆ తర్వాత మీడియాతో మాట్లాడారు.

Also read: నెహ్రూ, ఇందిరా గాంధీల సరసన మోదీ నిలుస్తారా.. ఆ రికార్డు సమం చేస్తారా?

అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది 

ఈవీఎంలను భద్రపరిచే గదులను ఎవరు తెరవాలకున్నా కూడా తమ అనుమతి కచ్చితంగా ఉండాలని.. ఇదంతా కూడా రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలోనే జరుగుతుందని తెలిపారు. ఏ ఈవీఎంలో ఎన్ని ఓట్లు పడ్డాయో అనే సమాచారం పోలింగ్‌ ఏజెంట్ల వద్ద ఉంటుందని.. లెక్కింపు ప్రారంభించే ముందు వారు వాటిని సరిచేసుకోవచ్చని.. పేర్కొన్నారు.

చర్యలు తీసుకోవాలని చెప్పాం

అలాగే ఒకరికి బదులు మరొకరు ఓట్లు వేయడంపై దృష్టి సారించాలని.. యంత్రంగానికి సూచనలు చేసినట్లు చెప్పామని రాజీవ్ కుమార్ పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియలో అవకతవకలు చేసేందుకు యత్నించేవారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించామని అన్నారు. ఓటింగ్‌ అయిపోయాక.. ఈవీఎంలను తరలించేందుకు అధికారిక వాహనాల్లోనే వెళ్లాని.. వాటికి తప్పనిసరిగా జీపీఎస్ సిస్టమ్ ఉండాలని తెలిపారు. ఓటరు కార్డులు, ఓటు వివరాలు, చీటీలు సకాలంలో జారీ చేయాలని.. పరిశీలకుల పేర్లు, ఫోన్‌ నెంబర్లు ప్రజలకు అందించాలని అన్నారు. అంతేకాకుండా ఫేక్ న్యూస్‌ వ్యాప్తి చెందకుండా చర్యలు తీసుకునేందుకు ఓ విభాగాన్ని ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు.

Also Read: నేటి నుంచి పల్స్ పోలియో వ్యాక్సిన్ డ్రైవ్!

Advertisment
తాజా కథనాలు