Chandrayaan-3: అంతా అయిపోయింది...ఇక ఆశల్లేవు

ఇస్రో ప్రతిష్టాత్మక ప్రయోగం చంద్రయాన్-3 కథ ఇంక ముగిసినట్టే. చంద్రుని మీద ఉన్న విక్రమ్ ల్యాండర్, ప్రజ్ఞాన్ రోవర్ లు మేల్కొనే ఛాన్స్ కనిపించడం లేదని ఇస్రో శాస్త్రవేత్తలు చెబుతున్నారు. భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో ఎంత ప్రయత్నం చేస్తున్నా ఫలితాలు కనిపించడం లేదని చెబుతున్నారు.

Chandrayaan-3: చంద్రయాన్-3 నుంచి మళ్ళీ సిగ్నల్స్..
New Update

Chandrayaan-3: చంద్రయాన్-3పై ఇస్రో శాస్త్రవేత్తలు (ISRO Scientists)ఆశలు వదిలేసుకున్నారు. నిద్రాణస్థితిలో ఉన్న విక్రమ్ ల్యాండర్ (Vikram lander), ప్రజ్ఞాన్ రోవర్‌‌(Pragyan rover)ను మేల్కొలిపి పనిచేయించడం ఇక సాధ్యం కాదన్న నిర్ణయానికి వచ్చేసినట్టు సమాచారం. చంద్రుని మీద 14 రోజులపాటు పరిశోధనలు చేసి విలువైన సమాచారాన్ని సేకరించిన తర్వాత విక్రమ్, ప్రజ్ఞాన్ లు రెండూ అక్కడ లూనార్ నైట్ (చంద్రుడిపై రాత్రి సమయం) ప్రారంభం కావడంతో నిద్రాణస్థితిలోకి వెళ్ళిపోయాయి.

ఆగస్టు 22న చంద్రుడిపై సూర్యోదయం కావడంతో వాటిని మళ్ళీ నిద్రలేపి ప్రయోగాలను కంటిన్యూ చేయాలని శాస్త్రవేత్తలు భావించారు. అప్పటి నుంచి వాటిని లేపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. వాటికి సిగ్నల్స్ పంపుతున్నా స్పందించడం లేదు. మళ్లీ లూనార్ నైట్ సమీపిస్తున్నా వాటిలో చలనం కనిపించకపోవడంతో ఇక దానిపై ఆశలు వదిలేసుకున్నట్టు తెలుస్తోంది.

నిజానికి అవి ఇప్పటికే మేల్కొనాల్సి ఉందని, కానీ ఆ పని జరగలేదంటే అవి ఇక నిద్రాణ స్థితి నుంచి బయటకు రావడం దాదాపు అసాధ్యమని ఇస్రో మాజీ చైర్మన్ ఏఎస్ కిరణ్ కుమార్ స్పష్టం చేశారు. భారత్‌ ప్రతిష్టాత్మకంగా ప్రయోగించిన ఈ మిషన్ ఇక ముగిసేనట్లేనని ఇస్రో మాజీ ఛైర్మన్ అభిప్రాయపడ్డారు. విక్రమ్ ల్యాండర్‌, ప్రజ్ఞాన్‌ రోవర్‌లు మేల్కొంటాయన్న ఆశలు సన్నగిల్లాయి.. ఒక వేళ అవి మేల్కొంటే ఇప్పటికే అది జరిగేది.. ఇక అవి నిద్రాణ స్థితి నుంచి బయటకు వచ్చే అవకాశం లేదు అని ఏఎస్‌ కిరణ్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు.

చంద్రయాన్‌-3 అనుకున్న లక్ష్యం ఇప్పటికే సాధించింది. ఏ దేశానికి సాధ్యం కాని రీతిలో జాబిల్లి (Moon) దక్షిణ ధ్రువంపై చంద్రయాన్‌ ల్యాండయ్యింది. ఇప్పటికే ఆ ప్రాంతం నుంచి విలువైన సమాచారం మనకు అందింది.ఇది కచ్చితంగా ఉపయోగపడే డేటా.. భవిష్యత్తులో చేపట్టే ప్రాజెక్టులకు విజ్ఞానపరంగా, ప్లానింగ్‌ పరంగా ఆ ప్రాంతానికి సంబంధించి ఈ సమాచారం ఎంతో ఉపయోగపడుతుంది కిరణ్ కుమార్ (Kiran Kumar) అన్నారు. అలాగే చంద్రుడి నుంచి నమూనాలను తీసుకొచ్చే అవకాశాలపై స్పందించారు. భవిష్యత్తులో ఇది సాధ్యం కావచ్చని అభిప్రాయపడ్డారు.సాంకేతిక సామర్థ్యం పెరగడం వల్లే చంద్రయాన్‌-3 (Chandrayaan-3) సాఫ్ట్‌ ల్యాండింగ్‌ జరిగిందని చెప్పారు. భవిష్యత్తులో చంద్రుని నుంచి నమూనాలను సేకరించి భూమిపైకి తీసుకొచ్చే ప్రాజెక్టులు కచ్చితంగా ఉంటాయని చెప్పారు. టెక్నాలజీ అభివృద్ధి ఆధారంగా భవిష్యత్తులో ఇలాంటి ప్రాజెక్టులు చేపట్టేందుకు అవకాశం ఉందని తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి అనేక విషయాలు ఉంటాయి.. ప్రణాళికలు రూపొందిస్తారు.. సాంకేతిక అభివృద్ధి ఆధారంగా ప్రతిపాదనలు ఉంటాయి. ఇది పూర్తిగా మొత్తం ప్రణాళిక ఎలా జరుగుతుంది.. ఎన్ని వనరులు అందుబాటులోకి వచ్చాయి అనే దానిపై ఆధారపడి ఉంటుంది.. కనుక చంద్రుడిపై నమూనాల తీసుకొచ్చే మిషన్ గురించి సమయం చెప్పడం చాలా కష్టం అని కిరణ్ కుమార్ అన్నారు.

Also Read: ఇరాన్ కు చెందిన మానవ హక్కుల కార్యకర్త.. నార్గిస్‌ కు నోబెల్ శాంతి బహుమతి

#chandrayan-3 #chandrayaan-3 #india #isro #scientist #moon #chandrayaan-3-mission #vikram-lander #pragyan-rover
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe