TDP Chief Chandrababu : మరికొన్ని నెలల్లో ఏపీ(AP) లో ఎన్నికల జరగనున్న వేళ టీడీపీ అధినేత చంద్రబాబు(Chandrababu) సంచలన వ్యాఖ్యలు చేశారు. వైసీపీ ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారని తెలిపారు. ప్రస్తుతం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలు ఏపీ రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టించాయి. వచ్చే ఎన్నికల్లో టీడీపీ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు.
చంద్రబాబు మీడియాతో మాట్లాడుతూ.. గతంలో మాదిరిగా కాకుండా ఈసారి త్వరగానే పోటీ చేసే అభ్యర్థులను ప్రకటిస్తామని అన్నారు. జనసేనతో పొత్తులో ఉన్నామని.. సీట్ల సర్దుబాటు చేసుకుంటున్నామని తెలిపారు. ఈ సారి అభ్యర్థుల ఎంపిక విధానం వినూత్నంగా ఉండబోతోందని తెలిపారు. వైసీపీలోని నేతలు తమతో టచ్ లో ఉన్నారని.. అసంతృప్తులు మాకెందుకు? అంటూ వైసీపీపై చురకలు అంటించారు.
ALSO READ:విద్యార్థులకు ట్యాబ్ లు పంపిణీ.. జగన్ సర్కార్ గుడ్ న్యూస్
వైసీపీ(YCP) నేతలు అక్కడ టిక్కెట్ రాలేదని తమ దగ్గరకు వస్తామంటే తమకు అవసరం లేదని తేల్చి చెప్పారు. వైసీపీలో మంచి వాళ్లు ఉంటే పార్టీలోకి తీసుకునే అంశంపై ఆలోచన చేస్తామని పేర్కొన్నారు. మద్య నిషేధం చేయకుంటే ఓటు అడగను అని చెప్పిన జగనుకు.. ఇప్పుడు ఓటు అడిగే హక్కు ఎక్కడిది..? అని ప్రశ్నించారు. పక్క రాష్ట్రాల్లో ఓటు లేని వారికి.. ఈ రాష్ట్రంలో ఓటు ఉంటే.. వాళ్లూ ఓటేయొద్దని ఎలా చెబుతారు? అని సీఎం జగన్ పై ఫైర్ అయ్యారు.
వైసీపీ ప్రభుత్వం సవ్యంగా ఉంటే వాళ్లు వేరే రాష్ట్రాలకు ఎందుకు వెళ్తారు? అని అన్నారు. జగన్ చేసేవన్నీ చెత్త పనులే అని మండిపడ్డారు. రిషికొండ మీద టూరిజం హోటల్ పేరుతో రూ. 500 కోట్లతో భవనం కడతారా?.. రిషికొండలో కట్టడాలు కట్టొద్దని చెప్పినా కొండను తవ్వేస్తారా?.. చట్టం సీఎంకు వర్తించదా..? అని చంద్రబాబు ధ్వజమెత్తారు. జగన్ లాంటి వాళ్లు రాజకీయాల్లో ఉండడానికి అర్హుడే కాదని అన్నారు. మూడు నెలల్లో జగన్ ఇంటికి వెళ్తారని జోస్యం చెప్పారు. సమయం వచ్చినప్పుడు ప్రజలు కర్రు కాల్చి వాత పెడతారని అన్నారు.
ALSO READ: బర్రెలక్కకు వచ్చిన ఓట్లు పవన్ కు రాలేదు.. సీఎం జగన్ సెటైర్లు!