AP Polls: ఏపీ అసెంబ్లీ ఎన్నికలు.. జిల్లాల పర్యటనలో చంద్రబాబు, పవన్

ఏపీలో అధికారాన్ని చేజిక్కించుకునేందుకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కసరత్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. మూడు రోజులపాటు చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో, కాకినాడ జిల్లాలో పవన్ కళ్యాణ్ పర్యటనలు చేయనున్నారు.

Andhra Pradesh: ఈరోజు ఢిల్లీకి పవన్ కల్యాణ్...పొత్తు ఖరారయినట్లేనా!
New Update

AP Assembly Elections: మరి కొన్ని నెలల్లో ఆంధ్ర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న విషయం తెలిసిందే. ఈ సారి ఎన్నికల్లో వైసీపీ జగన్ ప్రభుత్వాన్ని ఓడించి అధికారంలోకి రావాలని టీడీపీ అధినేత చంద్రబాబు వ్యూహాలు రచిస్తున్నారు. ఓట్లు చీలకుండా ఉండేందుకు జనసేన పార్టీ తో చంద్రబాబు పొత్తు పెట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా చంద్రబాబు, జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ ప్రజలోకి వెళ్లేందుకు జిల్లాల పర్యటన చేపట్టనున్నారు. సీఎం జగన్ ప్రభుత్వం యొక్క వైఫల్యాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు కార్యాచరణ చేపట్టారు. ఈ క్రమంలోనే జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టారు.

ALSO READ: నేను పార్టీ మారడం లేదు.. ఆర్టీవితో ఎమ్మెల్యే పూర్ణచంద్ర ప్రసాద్‌!

టీడీపీ ఛీఫ్ చంద్రబాబు నాయుడు రేపు తన సొంత నియోజకవర్గమైన చిత్తూరు జిల్లా కుప్పంలో పర్యటన చేపట్టనున్నారు. మూడు రోజుల పాటు కుప్పంలో నియోజకవర్గంలో ఉండనున్నారు. రామకుప్పం, శాంతిపురం, గుడుపల్లి,కుప్పం మండలాల్లో చంద్రబాబు పర్యటన చేపట్టనున్నారు. అక్కడి టీడీపీ కార్యకర్తలతో చంద్రబాబు భేటీ కానున్నారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై వారథి కలిసి చర్చించనున్నారు. మరోవైపు పవన్ కళ్యాణ్ ఈరోజు కాకినాడకు వెళ్లనున్నారు. రెండు రోజుల పాటు పవన్ కళ్యాణ్ అక్కడ పర్యటించనున్నారు. టీడీపీ జనసేన పొత్తుపై అక్కడి జనసైనికులతో పవన్ చర్చిననున్నారు. అయితే జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ టీడీపీ తో పొత్తులో భాగంగా కాకినాడ నుంచి పోటీ చేస్తారనే టాక్ అక్కడి రాజకీయాల్లో మొదలైంది. గత ఎన్నికల్లో ఓటమి చెవి చూసిన పవన్.. ఈ ఎన్నికల్లో జనసేనకు కనీసం 20 నుంచి 30 స్థానాల్లో విజయం సాధించాలని చూస్తున్నారు. మరి టీడీపీతో పొత్తులో ఉన్న జనసేన ఎన్ని స్థానాల్లో పోటీ చేస్తుందనేది మరి కొన్ని రోజుల వరకు వేచి చూడాల్సి ఉంది.

ALSO READ: ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలిగా షర్మిల.. గిడుగు రుద్రరాజు క్లారిటీ!

ఇండ్ల ఉండగా తాజాగా రాష్ట్ర రాజకీయాల్లో జనసేన ఛీఫ్ పవన్ కళ్యాణ్ పొత్తులో భాగంగా టీడీపీ అధినేత చంద్రబాబుపై అసంతృప్తిగా ఉన్నారని చర్చ జరుగుతోంది. ప్రముఖ రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ (Prashanth Kishore) ఇటీవల చంద్రబాబును కలవడం ఈ చిచ్చుకు కారణమైనట్లు సమాచారం. ఈ విషయంపై తనకు సమచారం ఇవ్వకపోవడంతో పవన్ (Pawan Kalyan) అసంతృప్తికి గురైనట్లు తెలుస్తోంది. పీకే చంద్రబాబును (Chandrababu) కలిసిన సమయంలో పవన్ విజయవాడలోనే ఉన్నారు. దీంతో తనను సంప్రదించకుండా పీకేతో సంప్రదింపులపై ఆయన నొచ్చుకున్నట్లు తెలుస్తోంది. ఈ విషయమై పార్టీ నేతలు, సన్నిహితుల వద్ద పవన్ కళ్యాణ్‌ అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

#chandrababu #tdp #janasena #pawan-kalyan #ap-elections-2024 #ap-news
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe