AP High Court:చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణను వాయిదా వేసిన హైకోర్టు

ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను ఏపీ హైకోర్టు ఈరోజు విచారించింది. తరువాత దీన్ని తదుపరి విచారణ కోసం డిసెంబర్ 1కి వాయిదా వేసింది. దాంతో పాటు మాజీ మంత్రి నారాయన, ఆయన అల్లుడు కేసులను కూడా హైకోర్టు వచ్చే నెలకు వాయిదా వేసింది.

New Update
AP High Court:చంద్రబాబు ఇన్నర్ రింగ్ రోడ్ కేసు విచారణను వాయిదా వేసిన హైకోర్టు

రాజధాని ఇన్నర్‌ రింగ్‌ రోడ్డు కేసులో టీడీపీ అధినేత చంద్రబాబు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ మీద హైకోర్టులో విచారణ జరిగింది. ఐఆర్‌ఆర్‌ మాస్టర్‌ ప్లాన్‌లో అవకతవకలు జరిగాయంటూ సీఐడీ కేసు నమోదు చేసింది. ఈ కేసులో చంద్రబాబు తరఫు న్యాయవాదులు తమ వాదనలను వినిపించారు. తరువాత హైకోర్టు దీని విచారణను డిసెంబర్ 1కి వాయిదా వేసింది. మరోవైపు అసైన్డ్ భూముల వ్యవహారంలో టీడీపీ మాజీ మంత్రి నారాయణ పిటిషన్‌ మీద కూడా ఈరోజు హైకోర్టులో విచారణ జరిగింది. ఈ కేసులో నారాయణ దాఖలు చేసిన ముందస్తు బెయిల్‌, క్వాష్‌ పిటిషన్లపై విచారణను ఉన్నత న్యాయస్థానం వాయిదా వేసింది. వచ్చే నెల అంటే డిసెంబర్ 11వ తేదీకి ఈకేసు విచారణను కోర్టు వాయిదా వేసింది.

Also read:ఏపీకి మరో ముప్పు..ముంచుకొస్తున్న మిచాంగ్ తుఫాను

ఇంకోవైపు మాజీ మంత్రి నారాయణ అల్లుడు వరుణ్ కు సిఐడి జారీ చేసిన లుక్ ఔట్ సర్క్యులర్ ను సవాల్ చేస్తూ హైకోర్టులో వేసిన పిటిషన్ మీద కూడా న్యాయస్థానం విచారణ చేసింది. ఈ కేసులో కౌంటర్ దాఖలు చేయడానికి సీఐడీ కోర్టును సమయం కోరింది. దీంతో ఉన్నత న్యాయస్థానం ఈ కేసు విచారణను వచ్చే నెల 6నకు వాయిదా వేసింది. ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో ఏ-19 నిందితుడిగా వరుణ్ ఉన్నారు.

Also read:కరీంనగర్ లో అర్ధరాత్రి హైటెన్షన్..పోలీసులతో బండి సంజయ్ వాగ్వాదం

Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు