అక్టోబర్ 3 నుంచి తెలంగాణలో పర్యటించనున్న భారత ఎన్నికల సంఘం

New Update
Telangana Elections 2023: తెలంగాణ సీఎం కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల సంఘం లేఖ

జాతీయ ఎలక్షన్ కమీషన్ మూడు రోజుల పాటూ తెలంగాణలో పర్యటించనుంది. త్వరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ సన్నద్ధతను ఈ కమిటీ పరిశీలించనుంది. అక్టోబర్ 3 న ఎలక్షన్ కమిషన్ అధికారులు హైదరాబాద్ వస్తారు.

మొదటి రోజు జాతీయ, రాష్ట్ర స్థాయి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలతో కీలక సమావేశాన్ని నిర్వహించనుంది భారత ఎన్నికల సంఘం. త్వరలో జరగబోయే రాష్ట్ర ఎన్నికల్లో ముఖ్యమై అంశాల మీద ఎన్నికల నిర్వహణ అధికారులు, సంస్థల ఈసీఐలతో సమావేశం అవుతుంది. రెండవ రోజున ఎన్నికల నిర్వహణకు సంబంధించి క్షేత్రస్థాయిలో ఎంత వరకు సంసిద్ధంగా ఉందనే విషయాన్ని పరిశీలిస్తుందని సీఈవో వికాస్ రాజ్ తెలిపారు. తెలంగాణలో 33 జిల్లాల ఎన్నికల అధికారులు, పోలీస్ సూపరెండెంట్, పోలీస్ కమీషనర్లు...భారత ఎన్నికల సంఘం బృందానికి నివేదికలను సమర్పిస్తారు. ఇందులో వారు ఎన్నికలకు ఏ విధంగా తయారుగా ఉన్నారో వివరిస్తారు.

ఇక మూవడ రోజున ఓటర్లను ఎలా చైతన్యపరుస్తున్నారు, ఎన్నికల్లో ఓటర్లు పాల్గొనడానికి సంబంధించిన కార్యకలాపాల మీద ఒక ప్రదర్శన చేస్తారని వికాస్ రాజ్ తెలిపారు. అంతేకాదు ఎన్నిక ప్రచారాన్ని నిర్వహించే ప్రముఖులు, దివ్యాంగ ఓటర్లు, యువ ఓటర్లను ఏంద్ర ఎన్నికల బృందం నేరుగా కలవనుంది. చివరలో పత్రికా విలేకరుల సమావేశం నిర్వహిస్తుందని వికాస్ రాజ్ తెలిపారు.

Advertisment
తాజా కథనాలు